Site icon NTV Telugu

Vishnuvardhan Reddy: కొడాలి నానికి విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్.. గన్నవరం వస్తా రెడీయా..?

Vishnuvardhan Reddy

Vishnuvardhan Reddy

Vishnuvardhan Reddy: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి బహిరంగ సవాల్‌ విసిరారు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు గన్నవరం బస్టాండ్ దగ్గరకు వస్తే బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు.. ప్రజా చార్జిషీట్‌పై చర్చకు సిద్ధమా అంటూ చాలెంజ్‌ చేశారు.. మాజీమంత్రి కొడాలి నాని వచ్చినా.. కట్టకట్టుకుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు వచ్చినా నేను రెడీ అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చామని.. కనీసం గుడివాడలోనైన పూర్తయ్యాయని చెప్పగలరా..? అంటూ సవాల్‌ చేశారు.. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ, తమ బంధువుల ఆస్తుల వ్యత్యాసం బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. 2024లో రాష్ట్రంలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Read Also: RBI: రూ.535 కోట్ల నగదుతో రోడ్డుపై నిలిచిపోయిన కంటైనర్.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇక, వైసీపీకి అనుకూలమైన ఓటే లేనప్పుడు.. చీలిక అనే ప్రస్తావనే రాదన్నారు విష్ణువర్ధన్‌రెడ్డి.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని ఓడించాలని ప్రచారం చేసిన పార్టీ.. ఇప్పుడు స్నేహం కోసం వెంపర్లాడుతోందంటూ సెటైర్లు వేశారు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో బీజేపీ ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలను గెలవబోతోందని జోస్యం చెప్పారు.. మరోవైపు.. ఏపీలో తాగడానికి నీళ్లు లేవు.. కానీ, మద్యం మాత్రం ఏరులై పారుతోందని విమర్శించారు. రేపు గన్నవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుతోంది.. 2024 ఎన్నికల మీద కీలకమైన చర్చ జరుగుతుందని.. భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ వ్యవహరించాల్సిన తీరు సహా పలు అంశాలపై కీలక చర్చ జరుగుతుందని వెల్లడించారు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి.

Exit mobile version