Site icon NTV Telugu

Sushil Modi: గత 6 నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను.. అందుకే పోటీ చేయడం లేదు..!

Susil Modi

Susil Modi

బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ సుశీల్‌ మోడీ ఇవాళ (బుధవారం) సంచలన ప్రకటన చేశారు. తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్‌ తో పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా రాబోయే లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా తెలియజేసినట్లు సుశీల్‌ మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు నేటి ఉదయం ఆయన ట్విట్టర్ (ఎక్స్‌) వేదికగా ఓ ట్వీట్‌ చేశారు.

Read Also: Kakarla suresh: కాకర్ల సమక్షంలో టీడీపీలోకి చేరికలు..

కాగా, ‘నేను గత 6 నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను అంటూ సుశీల్ మోడీ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈ కారణంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదన్నారు. దేశం, బీహార్‌, పార్టీకి ఎల్లప్పుడూ అంకిత భావంతో తాను పని చేశాను.. అందుకు కృతజ్ఞుతుడిని అంటూ సుశీల్ మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Exit mobile version