NTV Telugu Site icon

Bandi Sanjay : 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర.. ర్యూట్‌ మ్యాప్‌ ఆవిష్కరణ

Praja Sangrama Yatra

Praja Sangrama Yatra

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత లోగోను, రూట్ మ్యాప్ ను బీజేపీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర ఇంచార్జీ గంగిడి మనోహార్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువచ్చిందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 5 విడత ఈ నెల 28న ప్రారంభమవుతుందని, అడెల్లి పోచమ్మ దేవాలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. భైంసా నుంచి పాదయాత్ర ప్రారంభమై డిసెంబర్ 17న కరీంనగర్‌లో ముగుస్తుందని ఆయన వెల్లడించారు. భైంసా పట్టణంలో పాదయాత్ర ప్రారంభం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Also Read : Beetroot Benefits : బీట్ రూట్‌తో ఇన్ని బెనిఫిట్సా.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

సభకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఆయన తెలిపారు. బహిరంగ సభలో నిర్మల్ జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు రామారావు పటేల్ తన అనుచరులతో కలిసి పార్టీ లో చేరుతారని ఆయన వెల్లడించారు. ఇరవై రోజుల పాటు 5వ విడత పాదయాత్ర జరుగుతుందని మనోహర్‌రెడ్డి తెలిపారు. \
Also Read :Bandi Sanjay : రాష్ట్రంలో అవినీతి కుటుంబం పాలన కొనసాగుతున్నది

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద సభలు నిర్వహిస్తామని, సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరవుతారన్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ముగింపు సభ నిర్వహిస్తామని, 8 అసెంబ్లీల గుండా పాదయాత్ర జరుగుతుందన్నారు. పాదయాత్రలో చేరికలు భారీగా ఉంటాయని ఆయన మరోసారి ఉద్ఘాటించారు.