Site icon NTV Telugu

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు టెన్షన్‌లో బీజేపీ..

Maharastra

Maharastra

మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన ( షిండే వర్గం), ఎన్‌సీపీ ( అజిత్ ))లో సీట్ల పంచాయితీ కొనసాగుతుంది. అయితే, ఈ ఏడాది అక్టోబర్‌లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 100 స్థానాల్లో పోటీ చేసే అవకాశం తమ పార్టీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీకి టెన్సన్ పట్టుకుంది.

Read Also: Mudragada Padmanabha Reddy: పేరు మారింది.. ఇక, ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి

అయితే, శివసేన (షిండే) 58వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ నాథ్ షిండే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుధవారం రాష్ట్ర మాజీ మంత్రి రాందాస్ కదమ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు 100 సీట్లు కావాలి, వాటిలో 90 సీట్లు గెలుస్తాం అని డిమాండ్ చేశారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పార్టీకి కూడా 80- 90 సీట్లు ఇవ్వాలంటూ మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్ ఇటీవల వ్యాఖ్యానించారు.

Read Also: Air Pollution: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. రోజూ 2 వేల మంది చిన్నారుల బలి!

వీరి ఇరివురి వ్యాఖ్యలపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. బీజేపీ అతిపెద్ద పార్టీ, రాష్ట్ర ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. దీనిపై మూడు పార్టీల నేతలు సమావేశమై చర్చించిన తర్వాతే సీట్ల పంపకాల ఫార్ములా ఖరారు కానుంది అని చెప్పుకొచ్చారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 స్థానాలకు గాను 17 స్థానాలను అధికార మహాయుతి కైవసం చేసుకుంది. బీజేపీ 9, శివసేన 7, ఎన్సీపీ 1 సీట్లలో విజయం సాధించాయి.

Exit mobile version