NTV Telugu Site icon

BJP: భారీ షాక్.. మాజీ క్యాబినెట్ మంత్రితో సహా 12 మంది నేతల సస్పెండ్.. ఎందుకంటే?

Bjp

Bjp

పంజాబ్ బీజేపీ చాలా మంది నేతలపై చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా మాజీ క్యాబినెట్ మంత్రితో సహా డజను మంది నాయకులను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. వేటు పడిన వారిలో భగత్ చున్నీలాల్ కూడా ఉన్నారు. ఆయన పంజాబ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.

READ MORE: Arvind Kejriwal: 40 శాతం మహిళలు నాకు ఓటు వేయరు.. మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు

పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేతల పేర్లు…
1. భగత్ చున్నీ లాల్ (మాజీ క్యాబినెట్ మంత్రి, పంజాబ్ ప్రభుత్వం)
2. అర్జున్ టెహన్
3. అనుపమ్ శర్మ
4. సుఖ్‌దేవ్ సోను
5. హతీందర్ తల్వార్
6. హసన్ సోని
7. దినేష్ దువా (సన్నీ దువా)
8. సుభాష్ ధల్
9. అజయ్ చోప్రా
10. ప్రదీప్ వాసుదేవ
11. గుర్విందర్ సింగ్ లాంబా
12. బల్వీందర్ కుమార్
13. ఇంద్రపాల్ భగత్(ఘధా)

READ MORE: Lok Sabha: మోడీ ప్రసంగ సమయంలో రాహుల్ మొబైల్ వాచ్.. స్పీకర్ రియాక్షన్ ఇదే..!

భారతీయ జనతా పార్టీ పంజాబ్ ఇన్‌ఛార్జి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, జాతీయ కార్యదర్శి, కో-ఇన్‌చార్జ్ నరేంద్ర రైనా, ఇతర సీనియర్ నాయకులు చర్చించిన తర్వాత.. ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నాయకులను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. అక్టోబర్‌లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సత్కర్ కౌర్‌ను కూడా పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి 6 సంవత్సరాల పాటు బహిష్కరించింది. డ్రగ్స్ కేసులో పంజాబ్ పోలీసులు సత్కర్‌ను అరెస్ట్ చేయడంతో బీజేపీ ఈ చర్య తీసుకుంది. అక్టోబర్ 23న పంజాబ్ పోలీసులు సత్కర్ కౌర్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసులో మొహాలిలోని యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అంతే కాదు, అరెస్ట్ తర్వాత మాజీ ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడించారు.