Site icon NTV Telugu

BJP vs Shiv Sena: మహారాష్ట్రలో బీజేపీ- శివసేన మధ్య సీట్ల పంచాయితీ.. ఇంకా కుదరని లెక్క

Bjp Vs Shinde

Bjp Vs Shinde

మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మాత్రం సీట్ల పంచాయితీ కొనసాగుతుంది. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, శివసేన(శిండే)ల మధ్య సీట్ల పంపకాలపై పెద్ద యుద్ధమే నడుస్తున్నట్టు టాక్. ఇరు వర్గాలు నాయకులు ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం కొనసాగుతుంది. దీంతో బీజేపీ, షిండే వర్గాలకి చెందిన శివసేన నాయకులు ఆందోళన పడుతున్నారు. సీట్ల పంపకంపై ఇరుపార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలోని మొత్తం 48 స్థానాలకు గాను బీజేపీ 29, శివసేన 13, ఎన్సీపీ(అజిత్ పవార్) 6 స్థానాల్లో బరిలోకి దిగుతాయని భావించాయి. అయితే, షిండే వర్గం 22 సీట్లు కావాలని డిమాండ్ చేశారు. కానీ, చర్చల తర్వాత ఈ ప్రతిపాదనకు ఏక్ నాథ్ షిండే ఒప్పుకున్నారని బీజేపీ నేతలు తెలిపారు. అయితే, ఇప్పటికీ ఫైనల్ లిస్టు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Sanjay Singh : సంజయ్ సింగ్ పాస్‌పోర్ట్ జప్తు .. కోర్టు షరతులు ఇవే?

ఇక, 2014, 2019 ఎన్నికల్లో శివసేన పోటీ చేసి గెలిచిన కళ్యాణ్, థానే, నాసిక్, సిందుదుర్గ్, రత్నగిరి సీట్లపై బీజేపీ కన్నేసినట్లుంది. అయితే, ఈ సారి పలు సర్వేలు అక్కడ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అక్కడ తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు బీజేపీ రెడీ అవ్వగా అందుకు సీఎం షిండే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కళ్యాణ్ స్థానం నుంచి ప్రస్తుతం షిండే కుమారుడు శ్రీకాంత్ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో బీజేపీ ప్రతిపాదనకు అంగీకరిస్తే శివసేన నాయకులకు తప్పుడు సంకేతం వెళ్తుండటంతో ఈ సీట్లపై ఏక్ నాథ్ షిండే పట్టువీడటం లేదని టాక్. దీంతో ఈ సీట్లపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.

Read Also: AP Pension: సచివాలయాలకు క్యూ కట్టిన పెన్షన్ దారులు.. మండుటెండలో వృద్ధుల ఎదురుచూపు!

అయితే, సీట్ల పంపకాల విషయంలో బీజేపీ, శివసేన (షిండే)ల మధ్య వాగ్వాదంతో ఏక్ నాథ్ షిండే వర్గంలోని సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మహా వికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ) తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. కానీ, అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో ఇంకా సీట్ల పంపకంపై క్లారిటీ రాకపోవడంతో షిండే వర్గంలోని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. కాగా, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ఈ పరిణామాలపై శివసేన( ఉద్దవ్ వర్గం) నాయకుడు రావుసాహెబ్ స్పందించారు. ఉద్ధవ్ థాక్రే బీజేపీతో సరైన విధంగా వ్యవహరించాడు.. కానీ ఏక్ నాథ్ షిండే ఫెయిల్ అయ్యాడు అని పేర్కొన్నాడు.

Exit mobile version