దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు ఎట్టకేలకు దొరికేసింది. గత నెల 19వ తేదీన ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో కనిపించింది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేపీ నడ్డా సతీమణి మళ్లికా ఫార్చునర్ ఎస్యూవీ కారు మార్చి 19న మధ్యాహ్నం 3 గంటల సమయంలో దొంగతనానికి గురైంది. కారు డ్రైవర్ జోగిందర్ దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పురిలో ఉన్న ఓ సర్వీసింగ్ సెంటర్ నుంచి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
Read Also: Constable Suicide: హైదరాబాద్ లో ARSI బాలేశ్వర్ ఆత్మహత్య.. కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
కాగా, జేపీ నడ్డా నివాసానికి చేరుకునే క్రమంలో మధ్యలో తన ఇంటి దగ్గర భోజనం కోసం కారును బయట నిలిపి ఉంచగా.. అదే, సమయంలో దుండగులు కారును ఎత్తికెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఈ కారు గురుగ్రామ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే, సుమారు 20 రోజుల తర్వాత ఆ కారును వారణాసిలో పట్టుకున్నారు. ఫరిదాబాద్ సమీపంలోని భధ్కల్కు చెందిన షాహిద్, షివంగ్ త్రిపాఠి ఆ కారును వారణాసికి తీసుకు పోయినట్లు చెప్పారు. భద్కల్లో కారు నంబర్ ప్లేట్‌ను మార్చి.. అలీగఢ్, లఖింపూర్ ఖేరి, బరేలీ, సీతాపూర్, లక్నో మీదుగా వారణాకి తీసుకుపోయినట్లు చెప్పారు. దానిని నాగాలాండ్‌కు తరలించాలని నిందితులు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.