జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో భద్రతా దళాలు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని గువా పోలీస్ స్టేషన్ పరిధిలోని లిపుంగా ప్రాంతానికి సమీపంలో ఉదయం 5 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరిని అరెస్టు చేశామని జార్ఖండ్ పోలీసు అధికార ప్రతినిధి, ఐజీ (ఆపరేషన్స్) అమోల్ వి హోంకర్…
దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు ఎట్టకేలకు దొరికేసింది. గత నెల 19వ తేదీన ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో కనిపించింది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.