Site icon NTV Telugu

Navneet Kaur: అమరావతిలో నామినేషన్ వేసిన నవనీత్ కౌర్

Navneth

Navneth

సినీ నటి, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ అమరావతిలో నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అఫిడవిట్ సమర్పించేటప్పుడు ప్రమాణపత్రాన్ని చదివారు. 2019లో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి నవనీత్ కౌర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం ఆమె బీజేపీకి దగ్గరయ్యారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ అమరావతి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నవనీత్ కౌర్ పేరును ప్రకటించింది. దీంతో ఆమె గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా ప్రకటన వెలువడగానే మహారాష్ట్ర బీజేపీ నేత, డిప్యూటీ సీఎం ఫడ్నవిస్‌, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నవనీత్ కౌర్ దంపతులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: CPM manifesto: “సీఏఏ, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల రద్దు, ఆర్టికల్ 370 పునరుద్ధరణ”.. సీపీఎం మేనిఫెస్టో విడుదల..

ఇదిలా ఉంటే గురువారం నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కుల ధృవీకరణ పత్రం విషయంలో అనుకూల తీర్పు వెలువరించింది. దీంతో ఆమెకు ఎన్నికల ముందు బిగ్ రిలీఫ్ లభించింది. నవనీత్ రాణా 2019లో ఎస్సీ కేటగిరిలో అమరావతి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. కాకపోతే ఈ విషయంలో నవనీత్ రానా అందించిన ఎస్సీ సర్టిఫికెట్లు సరైనవి కాదని కొందరు బాంబే హైకోర్టులో కేసు వేశారు. విచారణలో భాగంగా కోర్టు ఆమెకు రెండు లక్షల జరిమానా విధించింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఆమెకు అనుకూలంగా రాకపోవడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం ఆమెకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Hema Malini: హేమమాలినిపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ నోటీసులు

నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. 2021, జూన్ 8న ‘మోచి’ కుల ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించి మోసపూరితంగా పొందిందని హైకోర్టు అప్పట్లో పేర్కొంది. దీనితో ఎంపీ నవనీత్ రాణాకి రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది. నవనీత్ రాణా ‘సిక్కు-చామర్’ కులానికి చెందినదని రికార్డులు సూచించాయి. అయితే తాజా తీర్పుతో అవేవి నిజం కాదని తేలిపోయింది. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల ముందు నవనీత్‌కౌర్‌కు భారీ ఉపశమనం లభించింది.

ఇది కూడా చదవండి: Viral Video: తల్లి ప్రేమంటే ఇదే భయ్యా.. రోడ్డు పక్కన కూర్చున్న అమ్మ ఏం చేస్తుందో చూడండి..

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. అటు తర్వాత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న చివరి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.

Exit mobile version