Site icon NTV Telugu

MLA Rajasingh: రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ..!

Raja Singh

Raja Singh

MLA Rajasingh: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామాను తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి సంబంధించిన విషయంలో నొచ్చుకున్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో రాజాసింగ్ తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు. లేఖను స్పీకర్‌ కు పంపించాలని కూడా సూచించారు.

Read Also:Asia Cup 2025: ఆసియా కప్‌ నిర్వహణపై అనిశ్చితి… ఢాకా మీటింగ్‌కు భారత్, శ్రీలంక దూరం!

తెలంగాణ బీజేపీలో చాలా లోపాలు ఉన్నాయని.. కొంతమంది పార్టీలో ఎదగకుండా చేస్తున్నారని ఆయన ఆ సమయంలో వ్యాఖ్యానించారు. అలాగే కొందరు పార్టీ ప్రగతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు మద్దతు ప్రకటించిన ముగ్గురు కౌన్సిల్ మెంబర్స్‌ను బెదిరించారని ఆయన అప్పట్లో ఆరోపించారు. తనను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేట్ చేయనివ్వలేదని.. ప్రెసిడెంట్ ను ఎవరిని చేయాలో ముందే నిర్ణయించుకున్నప్పుడు ఎన్నికలు ఎందుకు..? అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు.

Read Also:Viajay & Manchu : విజయ్ దేవరకొండ పై.. మనోజ్ కౌంటర్

Exit mobile version