Site icon NTV Telugu

Bio Asia 2026: లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ నయా రికార్డ్.!

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 23వ బయో ఏషియా (BioAsia) 2026 అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 17 నుండి భాగ్యనగరంలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ (HITEX) వేదికగా రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 17, 18) జరగనున్న ఈ సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

ఈ ఏడాది సదస్సును ‘టెక్‌బయో అన్‌లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ (TechBio Unleashed – AI, Automation & the Biology Revolution) అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ వంటివి లైఫ్ సైన్సెస్ , హెల్త్‌కేర్ రంగాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయనే అంశాలపై ఈ సదస్సులో లోతైన చర్చలు జరగనున్నాయి.

Bhatti Vikramarka : ప్రజల నమ్మకమే గెలిచింది.. మధిరను మోడల్ సిటీగా మారుస్తాం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి, అనంతరం సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు అంతర్జాతీయ స్థాయి నిపుణులు పాల్గొంటారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్, ఆమ్జెన్ (USA) చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ హోవర్డ్ వై చాంగ్ పాల్గొననున్నారు. వీరితో పాటు 50కి పైగా దేశాల నుండి సుమారు 4,000 మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు , ఫార్మా దిగ్గజాలు ఈ వేదికపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన అనేక కీలక అంశాలతో పాటు నెక్స్ట్ జనరేషన్ బయోలాజిక్స్.. ఔషధ తయారీలో వస్తున్న నూతన మార్పులు. ఏఐ & డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్.. డేటా అనలిటిక్స్ , ఏఐ సాయంతో రోగ నిర్ధారణ, చికిత్స. తెలంగాణ రైజింగ్ 2047..  2047 నాటికి తెలంగాణను వరల్డ్-క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్‌గా మార్చే రోడ్‌మ్యాప్. ఆర్ & డీ (పరిశోధన).. గ్లోబల్ హెల్త్ ఇంపాక్ట్ , కొత్త వ్యాధుల చికిత్సకు అవసరమైన మౌలిక వసతులు వంటి వాటిపై చర్చాగోష్టులు నిర్వహించనున్నారు.

ఈ సదస్సు ద్వారా హైదరాబాద్ నగరం ప్రపంచ లైఫ్ సైన్సెస్ మ్యాప్‌లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో సుమారు 9,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, 175కి పైగా ప్రదర్శనకారులు (Exhibitors) ఈ సదస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. దేశంలోనే అతిపెద్ద ‘టెక్‌బయో’ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సదస్సు రూపుదిద్దుకుంది.

Mohsin Naqvi: సొంత దేశం అభిమానుల నుంచే థ్రెట్..? మ్యాచ్ మధ్యలోనే పీసీబీ బాస్ నఖ్వీ పరార్ (వీడియో)

Exit mobile version