Bill Gates: ఇండియాలో ఆటో నడుపుతున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్

Billgates

Billgates

Bill Gates: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ఇటీవల భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షా తయారీ కేంద్రంలో సరదాగా ఆటో నడిపారు. ఆ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆవిష్కరణల కోసం భార‌తీయుల త‌ప‌న ఎప్పటికీ తీరిపోదన్నారు. నేనో ఎల‌క్ట్రిక్ రిక్షాను న‌డిపాను అన్నారు. ఆ రిక్షా 131 కిలోమీట‌ర్ల దూరం ప్రయాణిస్తుంద‌ని, దాంట్లో న‌లుగురు ప్రయాణికులు వెళ్లవ‌చ్చు అన్నారు. ట్రాన్స్‌పోర్టు ఇండ‌స్ట్రీలో కార్బన్ ర‌హిత వాహ‌నాల‌కు మ‌హేంద్ర కంపెనీ ఆదర్శనీయంగా నిలుస్తుంద‌ని బిల్ గేట్స్ ఆ వీడియోకు కామెంట్ చేశారు. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా స్పందించారు.

Read Also: Tamilnadu: తమిళనాడులో ఘోరం.. కరెంట్ ఫెన్సింగ్ కారణంగా ఏనుగులు మృతి

మరోసారి భారత్‌కు వచ్చినప్పుడు మీరు, నేను, సచిన్‌ టెండూల్కర్ కలిసి.. ఆటో రేస్‌లో పోటీ పడదామంటూ సరదాగా ప్రతిపాదించారు. ఒకసారి ఛార్జింగ్‌తో దాదాపు 131 కి.మీల వరకు ప్రయాణించే ఓ ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షాను నడిపానంటూ బిల్‌ గేట్స్‌ సంబంధిత వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆయన ఆటో నడుపుతోన్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘చల్తీ కా నామ్‌ గాడీ’ అనే బాలీవుడ్‌ సినిమాలోని పాట వస్తోంది. ‘రవాణా పరిశ్రమకు సంబంధించి కర్బనరహిత ప్రయత్నాలకు మహీంద్రా వంటి కంపెనీల సహకారం స్ఫూర్తిదాయకం’ అని బిల్‌ గేట్స్‌ ప్రశంసించారు. ఈ పోస్ట్‌ను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన మహీంద్రా.. ఇది ‘చల్తీ కా నామ్‌ బిల్‌గేట్స్‌ కీ గాడీ’ అని పేర్కొన్నారు.