Bike Theft Gang Busted: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

  • గచ్చిబౌలి పీఎస్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
  • ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Bike Theft Gang

Bike Theft Gang

Bike Theft Gang Busted: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీల్లో ఈ ముఠా పట్టుబడింది. ఐదుగురు సభ్యుల ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 16 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఏ1 దేవకిషోర్, ఏ2 వీర వెంకట సత్యనారాయణ, ఏ5 దిలీప్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వీరు గతంలో స్విగ్గీ డెలివరీ బాయ్స్‌గా పని చేసినట్లు తెలిసింది. జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారారు.

Read Also: Crime News: చాక్లెట్ ఆశ చూపి బాలికపై లైంగిక దాడికి యత్నం

నిర్మానుష్య ప్రాంతాలు, సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ముఠా దొంగతనాలకు పాల్పడుతోంది. ఎక్కువగా ఖరీదైన బైక్స్‌ను టార్గెట్ చేస్తూ ముఠా చోరీలు చేస్తోంది. మేజర్‌గా హాస్టల్స్, అపార్ట్మెంట్స్‌ను ముఠా టార్గెట్ చేస్తోంది. ప్రధాన సూత్రధారి దేవకిషోర్ సహాయంతో డూప్లికేట్ మాస్టర్ కీస్‌ను ముఠా తయారీ చేస్తోంది. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్‌లో దొంగిలించిన వాహనాలను ఈ ముఠా దాచింది. దొంగిలించిన వాహనాలను ఆంధ్రాలో అమ్మడానికి బేరం కుదిరించుకుంది. ముగ్గురిని అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీసులు రిమాండ్‌కు పంపించారు. మరో ఇద్దరు మైనర్‌ నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.