Road Accident : ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన పాల ట్యాంకర్.. 18 మంది మృతి..
- ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.
- లక్నో ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై ట్యాంకర్ డబుల్ డెక్కర్ బస్సు ఢీ.
- ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రయాణికులు మరణించగా 19 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై ట్యాంకర్, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు చాలాసార్లు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రయాణికులు మరణించగా, 19 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
Redmi 13 5G Price: భారత్ మార్కెట్‌లోకి రెడ్‌మీ 13 5జీ.. ఫోన్‌తో పాటే ఛార్జర్!
Also Read
అందిన సమాచారం ప్రకారం, డబుల్ డెక్కర్ బస్సు (UP95 T 4720) బీహార్ లోని మోతిహారి నుండి ఢిల్లీకి వస్తోంది. ఉన్నావ్ లోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గధా గ్రామానికి ఉదయం 5.15 గంటలకు బస్సు చేరుకోగా, వేగంగా వచ్చిన పాలతో నిండిన ట్యాంకర్ దానిని వెనుక నుండి ఓవర్‌టేక్ చేసే సమయంలో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డబుల్ డెక్కర్ బస్సు ఒక్కసారిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతదేహాలు కుప్పలుగా పడ్డాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
TDP Worker Killed: అనంతపురంలో టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి చేసి హత్య..
ఉన్నావ్ డీఎం గౌరంగ్ రాఠీ మాట్లాడుతూ.. “ఈ ప్రమాదం తెల్లవారుజామున 5.15 గంటలకు జరిగింది. బీహార్‌లోని మోతిహారి నుండి వస్తున్న ప్రైవేట్ బస్సు పాలు నింపిన ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించారు. మరో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారందరికీ చికిత్స అందిస్తున్నామని ” ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!