భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత సమయంలో బీహార్‌కు చెందిన ఓ జావాన్ అమరవీరుడయ్యారు. ఆ అమరవీరుడికి వివాహం జరిగి కేవలం ఐదు నెలలు మాత్రమే అయ్యింది. ఈ వార్త విన్న భార్య షాక్‌కి గురైంది. ఆ జవాన్ పేరు రాంబాబు ప్రసాద్. ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న తన భార్యను ఒంటరిగా వదిలేశాడు. వాస్తవానికి తమది ప్రేమ వివాహమని ఆ సైనికుడు రాంబాబు భార్య అంజలి తెలిపింది. తమ ప్రేమ వ్యవహారం 8 సంవత్సరాలుగా కొనసాగిందని.. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి చాలా సంవత్సరాలు పట్టిందని ఆ నవ వధువు వాపోయింది.
READ MORE: Toilet seat explode: టాయ్‌లెట్ సీట్ పేలి వ్యక్తికి తీవ్రగాయాలు.. అసలు ఎందుకు ఇలా జరిగింది..?
అమరవీరుడు రాంబాబు వసిల్‌పూర్ సివాన్ జిల్లాలోని బర్హరియా బ్లాక్ నివాసి. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అమరవీరుడిని చివరి చూపు చూసేందుకు వేలాది మంది తరలి వచ్చారు. అతని భార్య, తల్లి మృతదేహాన్ని పట్టుకుని ఏడుస్తూనే ఉన్నారు. అంత్యక్రియలకు ముందు.. తన చివరి కోరిక ఏంటని ఆ భార్యను సైనిక సిబ్బంది అడిగింది. ఆమె చెప్పిన సమాధానం విన్న ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు.
” నా భర్త రాంబాబు మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకెళ్లే ముందు మా గదికి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. నా రాంబాబుని నాతో చివరగా ఒక్క అరగంట వదిలేయండి.” అని అంజలి ఆర్మీ అధికారులతో చెప్పింది. ఇది విన్న సైనిక సిబ్బంది వెంటనే మృతదేహాన్ని గదికి తీసుకెళ్లారు. దాదాపు అరగంట పాటు గదిని మూసి ఉంచారు. రాంబాబు కుటుంబ సభ్యులు లోపలే ఉన్నారు. అనంతరం అమరవీరుడి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా.. వివాహం తర్వాత.. రాంబాబు ఎక్కువ సమయం విధుల్లోనే ఉన్నారు. అమరవీరుడైన రోజు కూడా ఉదయం తన భార్యతో ఫోన్‌లో మాట్లాడారు. సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తానని మాట ఇచ్చారు. కానీ మే 13న, అకస్మాత్తుగా మరణవార్త బయటకు వచ్చింది.
READ MORE: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
