Women Empowerment Scheme: మహిళలకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లలోకి రూ.10 వేలు వచ్చాయా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women Empowerment Scheme: బీహార్ మహిళలకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ మహిళా సాధికారత వైపు ఒక బలమైన అడుగు వేసి, రాష్ట్రంలోని 2.5 మిలియన్ల మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాలను అందించారు. పాట్నాలోని తన అధికారిక నివాసం, 1 అన్నే మార్గ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, ముఖ్యమంత్రి DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా ఒకే క్లిక్‌లో కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లోకి విడుదల చేశారు.
Also Read
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
ఖాతాల్లోకి బదిలీ అయిన రూ.2500 కోట్లు..
ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తి పారదర్శకతను కొనసాగించిందని అధికారులు వెల్లడించారు. ఈ పథకంలో ప్రభుత్వం మధ్యవర్తుల పాత్రను తొలగించి, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులను బదిలీ చేసింది. సోమవారం ఈ పథకంలో భాగంగా మహిళల ఖాతాల్లోకి మొత్తం రూ.2,500 కోట్లు విడుదలయ్యాయి, ప్రతి లబ్ధిదారు మహిళ అకౌంట్లోకి రూ.10 వేలు వేశారు. చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న లేదా వారి ప్రస్తుత జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి కష్టపడుతున్న మహిళలకు ఈ మొత్తం ఒక వరంగా చెబుతున్నారు.
గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని బీహార్‌లో ప్రారంభించారు. అప్పటి నుంచి, ఈ పథకం క్రమంగా విస్తరిస్తోంది. ఈ పథకం కింద దాదాపు 18.1 మిలియన్ల మహిళలు ఒక్కొక్కరికి మొదటి విడత రూ.10,000 అందుకున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ పథకంలో కేవలం రూ.10 వేలతోనే ఆగదు. ఇది కేవలం స్టార్టింగ్‌లో ఇచ్చేదే అని, ఈ మొత్తాన్ని మహిళలు తమ సొంత వ్యాపారాలు లేదా ఉపాధిని కల్పించుకోడానికి ఉపయోగించుకోవాలని సమాచారం. ఈ మొత్తాన్ని సముచితంగా ఉపయోగించే మహిళలకు ప్రభుత్వం అందించే ప్రత్యేక సహాయం పొందుతారని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అందజేస్తున్న రూ.10 వేలను సద్వినియోగం చేసుకున్న లబ్ధిదారులు త్వరలో అదనంగా రూ.2 లక్షల అందుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు రూ.2 లక్షల వరకు అదనపు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని ఇటీవలే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.
READ ALSO: Hampi Gang Rape Case: హంపి మృగాళ్లకు ఉరిశిక్ష.. సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురికి ఉరి!
తాజావార్తలు
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
-
Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!