Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- బీహార్‌లో దారుణం
- నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు
- నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
- ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా.. న్యాయస్థానాలు తీవ్రంగా శిక్షలు విధిస్తున్నా మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా బీహార్‌లోని జమూయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న బాలికను దుండగులు అడ్డగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ పరిణామంతో బాధితురాలు బెంబేలెత్తిపోయింది. దీంతో బాలిక వదిలేయమని ప్రాధేయపడినా కిచకుల మనసు కరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
జమూయ్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు శనివారం సాయంత్రం ట్యూషన్ క్లాస్ ముగించుకుని బాలిక, బాలుడు స్కూటర్‌పై ఇంటికి బయల్దేరారు. జమూయ్-లఖిసరాయ్ రహదారిపై కొందరు యువకులు.. బాలికను అడ్డుకుని టార్చర్ చేయడం మొదలు పెట్టారు. ఈ పరిణామంతో బాలిక హడలెత్తిపోయింది. ఫ్లీజ్.. వదిలేయండి అంటూ బాధితురాలు వేడుకుంది. అయినా కూడా మృగాళ్ల మనసు కరగలేదు. పదే పదే బాలికపై చేతులు వేస్తూ వేధిస్తూ కనిపించారు. కొందరు బాలుడి చొక్కా కాలర్ పట్టుకుని లాగుతుంటే.. ఇంకొందరు బాలికను దూరంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాలిక తప్పించుకునేందుకు ప్రయత్నించగా ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి వెంబడిస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. శనివారం సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మొత్తానికి బాలుడు చెర నుంచి తప్పించుకుని బాలిక దగ్గరకు చేరుకున్నాడు. అనంతరం సమీపంలోని స్కూటర్ దగ్గరకు చేరుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా మళ్లీ నిందితులు వెంబడిస్తూ కనిపించారు. దీంతో బాలిక మరోసారి బతిమాలింది. వదిలేయండి అని వేడుకుంది. అంతటితో వీడియో ముగిసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ట్యాగ్ చేస్తున్నారు.
ఇక వీడియో ఆధారంగా జమూయ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత విద్యార్థుల నుంచి వివరాలు సేకరించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లుగా జమూయ్ ఎస్పీ విశ్వజిత్ దయాళ్ తెలిపారు.
రాహుల్ గాంధీ ఆగ్రహం
ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బాలికను కొందరు వ్యక్తులు వేధించి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారని పేర్కొంటూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలలపై లైంగిక నేరాల నిరోధం, విచారణకు ఉద్దేశించిన పోక్సో చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సాయంత్రం 7 గంటల సమయంలో బహిరంగ రహదారిపై ఓ బాలికకు భద్రత లేకపోవడంపై బీహార్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
బీహార్‌ను అలా చూడొద్దు
ఈ ఘటనను బీహార్ మంత్రి సునీల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. స్థానిక అధికారులు ప్రభుత్వ తరఫున తగిన చర్యలు తీసుకుంటారని, జమూయ్ ఎస్పీతో మాట్లాడతానని తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే ఒక్క ఘటన ఆధారంగా మొత్తం బీహార్‌లో ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పడం సరికాదని అన్నారు. బీహార్‌ను ‘జంగిల్ రాజ్’గా చిత్రీకరించడం కూడా సరికాదని పేర్కొన్నారు. ఘటనలో తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
- Tags
తాజావార్తలు
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
-
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
-
AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!