Site icon NTV Telugu

Bihar Cabinet: బీహార్ లో మంత్రివర్గ విస్తరణ.. సీఎం నితీశ్‌ దగ్గరే హోంశాఖ

Nitish Kumar

Nitish Kumar

Bihar: బీహార్‌ రాష్ట్రంలో బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం నితీశ్‌కుమార్‌ తన కొత్త క్యాబినెట్‌లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరికి ఆర్థిక, ఆరోగ్య, క్రీడా శాఖలను ఇవ్వగా, మరో ఉప ముఖ్యమంత్రి విజయ్‌ సిన్హాకు వ్యవసాయ, రోడ్లు భవనాలు, చిన్న నీటి పారుదల శాఖలను ఇచ్చారు. అలాగే, అత్యంత కీలకమైన హోంశాఖను మాత్రం సీఎం నితీశ్‌ తన దగ్గరే పెట్టుకున్నారు. వీరితో పాటు మరో ఆరుగురు మంత్రులైన విజయ్‌ కుమార్‌ చౌదరి, విజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌, డాక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌, శ్రవణ్‌ కుమార్‌, సంతోష్‌ కుమార్‌ సుమన్‌, సుమిత్‌ కుమార్‌ సింహాలకు కూడా సీఎం నితీశ్‌ పలు శాఖలను కేటాయించారు.

Read Also: GVL Narasimha Rao: ఉత్తరాంధ్రకు ఎంపీ జీవీఎల్ గుడ్‌న్యూస్.. రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం!

అయితే, నితీశ్‌ కుమార్‌ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయగా.. ఆ తర్వాత జేడీయూ-బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాడింది. కానీ, తర్వాత ఏడాదికే బీజేపీతో విభేదాలు రావడంతో కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి నితీక్ కుమార్ కొత్త సర్కార్ ఏర్పాటు చేశారు. ఈ పొత్తులో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి, నితీశ్‌ మళ్లీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు.

Read Also: Canada–India relations: భారత్‌పై మరోసారి విషం చిమ్ముతున్న కెనడా..

కాగా, ఇటీవల ఆర్జేడీతో కూడా విభేదాలు రావడంతో ఇప్పుడు ఆర్జేడీ- జేడీయూ ప్రభుత్వాన్ని కూల్చేసి.. మళ్లీ బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని నితీశ్ కుమార్ ఏర్పాటు చేశారు. బీహార్‌ లో బీజేపీ ముఖ్య నేతలు సామ్రాట్‌ చౌదరి, విజయ్‌ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదువులు వరించాయి. తాజాగా కొత్త క్యాబినెట్‌లోని మంత్రులందరికీ శాఖలను సీఎం కేటాయించారు.

Exit mobile version