Site icon NTV Telugu

Largest Screen of the Country: హైదరాబాద్ సినీ ప్రియులకు గ్రేట్ న్యూస్.. దేశంలో అతిపెద్ద స్క్రీన్

Imax

Imax

Largest Screen of the Country: సినిమా అభిమానుల టేస్ట్ కాలానుగుణంగా మారుతోనే ఉంది. రోజు రోజుకు థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుతోంది. ఇందుకు ఓటీటీల రాక ఒక కారణమైతే థియేటర్లలో టికెట్ రేట్ల పెంపు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అంతంత ఖర్చు పెట్టి డొక్కు స్క్రీన్లపై సినిమాలు చూడడం ఎందుకు కొన్ని రోజులైతే ఓటీటీల్లోకి వస్తుందన్న మైండ్ సెట్ కు వచ్చారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే భారీగా మెట్రో నగరాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కాలం చెల్లుతోంది. అంత ఖర్చు పెట్టి చిన్న స్క్రీన్ పై చూసే కంటే రేటు కాస్త ఎక్కువైనా సరే మ‌ల్టీప్లెక్స్ కు వెళ్లడం నయం అనుకుంటున్నారు. దీంతో విదేశాల్లో మాదిరిగా ఇప్పుడు మన దేశంలోనూ మ‌ల్టీప్లెక్స్ కల్చర్ ఎక్కువవుతోంది. ఈ క్రమంలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మల్టీప్లెక్సులు రకరకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి.

Read Also: Moinabad Farm House Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. మరో ఇద్దరికి సిట్ నోటీసులు

హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ థియేటర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నెక్లెస్ రోడ్డు పక్కన ఉన్న ప్రసాద్స్ ఐమాక్స్. ఐమాక్స్ లో ఇప్పటికే బిగ్ స్క్రీన్ ఉంది. సిటీలోనే పెద్ద స్క్రీన్ గా దానికి పేరుంది. మరికొన్ని రోజుల్లో ఐమాక్స్ లో దేశంలోనే అతి పెద్ద తెరపై సినిమా చూసే అవకాశం ప్రేక్షకులకు లభించనుంది. ఐమాక్స్ లో అతి పెద్ద తెరను యాజమాన్యం సిద్ధం చేసింది. ఈ స్క్రీన్ 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో ఉంది. దాంతో, ఇది భారత దేశంలో అతి పెద్ద సినిమా తెరగా రికార్డుకెక్కింది. కెనడాకు చెందిన ‘స్ట్రాంగ్ ఎండీఐ’ అనే ప్రొజెక్షన్ స్ర్కీన్ల తయారీ సంస్థ ప్రత్యేకంగా ఈ తెరను రూపొందించింది. సౌండ్ సిస్టమ్ ను కూడా అత్యుత్తమమైనది ఏర్పాటు చేశారు. డిసెంబర్ 16న అవ‌తార్ 2 విడుదల నాటికి ఈ తెర ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

Read Also:Jr.NTR Licious Add: టెంపర్ క్లైమాక్స్ లెవల్లో ఎన్టీఆర్ లేటెస్ట్ యాడ్

Exit mobile version