Bigg Boss Telugu: బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే ప్రారంభం అయ్యింది. గ్రాండ్ ఫినాలేకు ‘ఛాంపియన్’ సినిమా హీరో రోషన్, హీరోయిన్ అనస్వర రాజన్, నటుడు శ్రీకాంత్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. ఈ సీజన్‌లో టాప్ 5 ఆటగాళ్లుగా నిలిచిన వారిలో ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. తనూజ, డిమోన్ పవన్, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ ఈ సీజన్‌లో టాప్-5లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి టాప్ 5 ఆటగాళ్ల నుంచి సంజన గల్రానీ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు.
READ ALSO: Top Headlines @9PM : టాప్ న్యూస్
బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున శ్రీకాంత్‌కు టాప్-5లో అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత అప్పగించారు. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం టాప్-5లో నుంచి సంజన ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు. అనంతరం ఆమె వేదిక పైకి వచ్చిన తర్వాత మాట్లాడుతూ.. ‘‘నేను ఫ్లోరా షైనా సీనియర్ బ్యాచ్. హౌస్‌లో ఉన్న యంగ్ పీపుల్‌తో పోటీపడగలమా?అనుకున్నాం. కానీ, దేవుడి దయ వల్ల నేను టాప్-5 వరకూ వచ్చా. ప్రాణం పెట్టి ఆడాను. టాప్-4లో ఉన్నవాళ్లలో ఇమ్మాన్యుయేల్ గెలవాలని కోరుకుంటున్నా. ఇప్పటివరకూ జరిగిన 9 సీజన్లలో ఒక్క మహిళా విజేత కూడా లేరు. అందుకే తనూజ ఈ సారి విజేత అయ్యే అవకాశం ఉందని నా అభిప్రాయం’’ అని అన్నారు. ఆమె తర్వాత ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈ సీజన్‌కు విన్నర్‌కు ట్రోఫిని అందజేయడానికి మాస్ మహారాజా రవితేజ గెస్ట్‌గా రాబోతున్నట్లు సమాచారం.
READ ALSO: Simple Happiness Tips: సంతోషంగా ఉండటానికి.. సైన్స్ చెప్పిన సింపుల్ టిప్స్ ఇవే!