Bigg Boss 9 Winner: మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే.. విన్నర్ ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 9 Winner: మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే జరగబోతుంది. తెలుగు బిస్ బాస్ చరిత్రలో ఏ సీజన్లో లేని విధంగా ఈ సీజన్లో కామనర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో పరీక్షలకు తట్టుకొని చివరి వరకు నిలిచిన టాప్ 5 ఆటగాళ్లు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జరగబోతున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ టైటిల్ రేసులో ప్రస్తుతం రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచిన చరిత్ర సృష్టించిన వాళ్లే అవుతారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: MG Motor: పెరగనున్న ఎంజీ మోటార్స్ కార్ల ధరలు.. కొత్త ధరలు ఆ రోజు నుంచే అమల్లోకి
Also Read
- TTD Tickets: భక్తులను అయోమయానికి గురిచేసిన టీటీడీ.. చివరకు ఏమైందంటే?
- Ram Charan: ఏపీఎల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్.. ఫైనల్ మ్యాచ్‌కు మంత్రి!
- Ashwin: "సచిన్‌తో పోలికలా? అప్పటి రోజులు వేరు".. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ 'పెసరపప్పు పాయసం' చేసేయండి ఇలా.!
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో టాప్ 5 ఆటగాళ్లుగా తనూజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, డిమాన్ పవన్ ఉన్నారు. ఈ టాప్ 5లో ఇద్దరి మధ్యలోనే టైటిల్ కోసం వార్ జరుగుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఆ ఇద్దరిలో ఒక తనూజ, మరొకరు కళ్యాణ్ పడాల. నిజానికి కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఒక కామనర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇన్ని వారాల పోటీని తట్టుకొని, ఎలిమినేషన్లో నిలబడిన ప్రతీసారి ప్రేక్షకుల ఓట్లతో హౌస్‌లో కొనసాగుతూ, ప్రస్తుతం బిగ్ బాస్ టాప్ 5 ఆటగాళ్లలో ఒకరిగా ఉన్నాడు. ఇక పోతే తనూజ.. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్‌లో వన్ ఆఫ్ ది టఫ్ ఫైటర్స్‌లో తనూజ ఒకరంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి చేసుకున్నా, విన్నర్స్‌లో ఒక్కరు కూడా లేడీ లేరు. బిందుమాధవి విన్నర్ అయిన అది ఓటీటీ సీజన్‌కు కావడంతో ఇప్పటి వరకు ఒక్క లేడీ కూడా ఈ టైటిల్‌ను సొంతం చేసుకోలేదు. ఒక వేళ తనూజ ఈ టైటిల్‌ను ముద్దాడితే బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ లేడీ విన్నర్‌గా అవతరిస్తుంది. ప్రస్తుతానికి ఉన్న నివేదికల ప్రకారం ఈ ఇద్దరి మధ్యలోనే టఫ్ ఫైట్ ఉన్నట్లు టాక్ నడుస్తుంది. చివరి నిమిషంలో ఓటింగ్ తారుమారైన సందర్భాలు ఎన్నో ఉంటడంతో టైటిల్‌ను ముద్దాడేది ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
READ ALSO: Ram Charan: ఢిల్లీ వీధుల్లో రామ్‌చరణ్ పెద్ది షూటింగ్.. లీకైన ఫోటోలు
తాజావార్తలు
-
Citroen Aircross Comfort Edition: సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల.. ప్రీమియం ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Allu Arjun : ‘రాకా’కు స్మాల్ బ్రేక్.. లోకి సినిమా కోసం రెడీ అవుతున్న బన్నీ
-
TTD Tickets: భక్తులను అయోమయానికి గురిచేసిన టీటీడీ.. చివరకు ఏమైందంటే?
-
Ram Charan: ఏపీఎల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్.. ఫైనల్ మ్యాచ్‌కు మంత్రి!
-
ASUS ROG Laptops: ASUS నుంచి కొత్త AI ల్యాప్టాప్స్.. క్రియేటర్లు, గేమర్ల కోసం ప్రీమియం ROG లైనప్ విడుదల
ట్రెండింగ్
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!