Biggboss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ కంటెస్టెంట్ 8 లిస్ట్ వచ్చేసింది.. లాంచింగ్ ఎప్పుడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biggboss 8 : బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయిన షో బిగ్ బాస్. రియాలిటీ కాన్సెప్టుతో నడిచే షో ఇది. ఎన్నో ట్విస్టులతో సాగుతూ టెలివిజన్ రంగంలో సత్తా చాటుతోంది. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయిందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతారు. అలాగే.. సీజన్ మొదలు అయ్యేటప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉంటారో.. ఫైనల్ ఎపిసోడ్ టైంలో వచ్చినప్పుడు అప్పుడే అయిపోయిందా అంటూ నిరాశ వ్యక్తం చేస్తుంటారు. మళ్లీ కొత్త సీజన్ వచ్చే వరకు కళ్లు కాయలు కాసే వరకు ఎదురు చూస్తుంటారు. ఆ రేంజ్‌లో బిగ్‌బాస్ షోకు అభిమానులు ఉండడంతో బుల్లితెర పై బిగ్గెస్ట్ షోగా భారీ టీఆర్పీతో దూసుకుపోతుంది.
Read Also:Amarnath Yatra2024 : రెండో రోజు అమర్ నాథ్ యాత్ర బాబా బర్ఫానీని దర్శించుకున్న 14717 మంది భక్తులు
Also Read
అంతేకాకుండా దేశంలో ఉన్న పలు భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతుంది. అయితే, అన్నింటి కంటే తెలుగులోనే ఇది ఎక్కువగా రెస్పాన్స్ అందుకుని సత్తా చాటుతోంది. చాలా రికార్డులను సైతం క్రియేట్ చేసి తెలుగు షో సెన్సేషన్ అయిపోయింది. సీజన్ 8 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ ఆడియన్స్‌కు శుభవార్త అందింది. తెలుగులో ఇప్పటివరకు 7 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు సీజన్ 8కు రెడీ అయింది.
Read Also:Shatrughan Sinha: ఆసుపత్రిలో శత్రుఘ్న సిన్హా.. పరుగెత్తిన కొత్త పెళ్లి కూతురు సోనాక్షి!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 వచ్చే నెల 4 లేదా 11వ తేదీల్లో లాంచ్ కానున్నట్లు సమాచారం. అలాగే అందులో పార్టిసిపేట్ చేసే వ్యక్తుల వివరాలకు సంబంధించిన ఓ లిస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రాసెస్ ఇప్పటికే మొదలు అయినట్లు తెలుస్తోంది. సీజన్ 8 బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఎవరనేది తెలుసుకుందాం. విశ్వసనీయ సమాచారం మేరకు.. బిగ్ కంటెస్టెంట్స్‌గా ‘బర్రెలక్క, హేమ, క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖావాణి, హీరో రాజ్ తరుణ్, యాంకర్ రీతూ చౌదరి, కమెడియన్ కిరాక్ ఆర్పీ, కుమారీ ఆంటీ’ పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా.. అనుహ్యంగా పరువు హత్యతో సంచలనంగా మారిన అమృత ప్రణయ్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక దీనిపై మరింత క్లారిటీ రావాలంటే షో లాంచింగ్ వరకు వేచి ఉండాల్సిందే.
తాజావార్తలు
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!