Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..

Bigg Boss

Bigg Boss

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 6న వైభవంగా ప్రారంభమైంది. బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే ఈ రియాలిటీ షోలోకి ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో పది మంది ప్రముఖ సెలబ్రిటీలు కాగా, ఆరుగురు కామనర్స్ కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల వారపు రెమ్యూనిరేషన్లు, వారి పేమెంట్ ఒప్పందాలు అందరిలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీల ప్రజాదరణ, వారి సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇలా ప్రతీ కోణాన్ని పరిగణలోకి తీసుకొని యాజమాన్యం వారానికి ఇంత అని ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఈ సీజన్‌లో సెలబ్రిటీలకు చెల్లిస్తున్న పారితోషికాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. వాటిలో ముఖ్యంగా..

రాంప్రసాద్ (జబర్దస్త్): వారానికి రూ. 4.5 లక్షలు. ఈ సీజన్ సెలబ్రిటీలందరిలోనూ ఇతనికే అత్యధిక రెమ్యూనిరేషన్ అందుతోంది.

వర్షిని సౌందర్యరాజన్: వారానికి రూ. 3.75 లక్షలు (కొన్ని చోట్ల రూ. 3.5 లక్షలుగా కూడా పేర్కొన్నారు).

ముకేష్ గౌడ: వారానికి రూ. 3 లక్షలు.

త్రిగున్ (అలియాస్ అదిత్ ఈశ్వరన్): వారానికి రూ. 2.75 లక్షలు.

దేవ్జాని: వారానికి రూ. 2.75 లక్షలు.

నరేష్ (జబర్దస్త్): వారానికి రూ. 2.5 లక్షలు.

చైత్ర రాయ్: వారానికి రూ. 2.5 లక్షలు.

టెంపర్ వంశి: వారానికి రూ. 2 లక్షలు.

కృష్ణుడు (వినాయకుడు మూవీ హీరో): వారానికి రూ. 2 లక్షలు.

సుధీర్ రెడ్డి: వారానికి రూ. 1.25 లక్షలు అందుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక కామనర్ల రెమ్యూనిరేషన్ వివరాల్లోకి వెళ్తే.. కామనర్స్ నుంచి ఎంపికైన కంటెస్టెంట్లకు సెలబ్రిటీలతో పోలిస్తే వేరే రకమైన పేమెంట్ నిర్మాణం ఉంటుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంపికై ప్రవేశించిన ఆరుగురు కామనర్లకు వారానికి రూ. 70,000 చొప్పున పారితోషికం ఇస్తున్నారు. ఈ సీజన్‌లో ప్రాథమిక ఎంపిక ప్రక్రియలో భాగంగా ‘అగ్ని పరీక్ష’కు హాజరైన 15 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికీ బట్టలు, హోటల్ వసతి, ట్రావెలింగ్ ఖర్చుల నిమిత్తం రూ. 50,000 చెల్లించారు. కంటెస్టెంట్లతో బిగ్ బాస్ యాజమాన్యం చేసుకునే ఆర్థిక ఒప్పందాలు, చెల్లింపుల నియమావళి పక్కాగా రూపొందించబడతాయి. హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లకు అవసరమైన బట్టలు, కాస్ట్యూమ్స్ కొనుగోలు, ఇతర ప్రాథమిక ఖర్చుల కోసం మొదటి వారం రెమ్యూనిరేషన్‌ను గ్రాండ్ లాంచ్ డేకి రెండు రోజుల ముందే వారి బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ చేస్తారు.

కంటెస్టెంట్లకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండి వివరాలు సబ్మిట్ చేస్తే, మాట్లాడుకున్న మొత్తానికి 18 శాతం GST కలిపి చెల్లిస్తారు. జీఎస్టీ లేని పక్షంలో, ఒప్పందం ప్రకారం మాట్లాడిన అమౌంట్‌ను జీఎస్టీ లేకుండానే పే చేస్తారు. ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత, షో మొత్తం ముగిసాక వారి బకాయిలను చెల్లిస్తారు. మొదటి 80 శాతం అమౌంట్‌ను 3 నెలల వ్యవధిలో చెల్లిస్తారు. మిగిలిన 20 శాతం అమౌంట్‌ను ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తారు. షో పూర్తయిన 3 నెలల తర్వాత నుంచి.. తదుపరి 9 నెలల పాటు (మొత్తంగా ఒక సంవత్సరం) వేరే పోటీ ఛానల్స్‌లో ఇలాంటి రియాలిటీ షోలలో పాల్గొనకూడదని కంటెస్టెంట్లతో కఠినమైన ఒప్పందం ఉంటుందని తెలుస్తోంది.