తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు కలర్ ఫుల్ గా ఉంది.. కొత్తవాళ్ల ఎంట్రీతో నిండుగా ఉంది.. వచ్చిన ప్రతి అమ్మాయి కూడా రైతు బిడ్డను తెగ ఇష్ట పడుతున్నారు.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ప్రశాంత్ లో చాలా మార్పులుకనిపిస్తున్నాయి. పల్లెటూరి నుంచి వచ్చాడు కసితో గేమ్ ఆడి ప్రేక్షకులను మెప్పిస్తాడు అనుకుంటే రతిక తో డ్యూయేట్ కోసం రెడీ అయ్యాడు.. రైతు బిడ్డ అనే సింపతీ తో అమ్మాయిల తో పులిహోర కలుపుతున్నాడు..
ఆ తర్వాతే కొద్ది రోజులు బాగానే ఉన్న ఈ జంట ఏమైందో తెలియదు కానీ నువ్వా నేనా గొడవపడ్డారు.. దాంతో మనోడికి కోపం కట్టలు తెచ్చుకుంది.. దాంతో అక్కా అక్కా అని పిలిచాడు.. రతిక ఎలిమినేట్ అవ్వడంతో ప్రశాంత్ తో పాటు ప్రేక్షకులు కూడా హమ్మయ్య అనుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి ప్రశాంత్ తన బుద్డిచుపించాడు. ఆదివారం ఎపిసోడ్ల్ లో కొంతమంది కొత్త కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు. హౌస్ లోకి వచ్చిన వారిలో హాట్ బ్యూటీ అశ్విని కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు అశ్వినితో పులిహోర కలుపుతూ రచ్చ చేస్తున్నాడు ప్రశాంత్..
నామినేషన్స్ లో శోభా, అశ్విని మధ్య మాటల యుద్ధం జరిగింది.. దాంతో శోభా అరిచి గోల చేయడంతో అశ్విని బిత్తరపోయింది. దెబ్బకు ఏడుపు అందుకుంది. అయితే కెప్టెన్ అనే ట్యాగ్ తగిలించుకుని ఆమెను ఓదార్చుతూ రైతు బిడ్డ ప్రశాంత్ పులిహోర కలిపాడు. హౌస్ లో వాళ్లు వదిలిపెట్టిన కూడా.. మనోడు మాత్రం ఆమె పక్కనే కూర్చొని ఏడవకూడదు… ఏం కాదు.. ఇలా అందరు ఉంటారు.. టాస్క్ ను తెలివిగా ఆడాలి అప్పుడే జనాలు ఓట్లు వేస్తారు అంటూ ఓదార్చే పనిలో పడ్డారు.. అప్పటి నుంచి అమ్మడును మనోడు వదల్లేదు వెనకాల తిరుగుతూ కనిపిస్తున్నాడు.. ఇక జనాలు కూడా ఏం పనిరా బాబు..మళ్లీ మొదలు పెట్టాడు అని అనుకుంటున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ప్రశాంత్ కెప్టెన్ అన్న విషయం తాను మరిచిపోయాను అని పంచ్ కూడా వేశాడు బిగ్ బాస్.. మొత్తానికి మళ్లీ లవ్ ట్రాక్ మొదలైనట్లు కనిపిస్తుంది.. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..