Bigg Boss 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం ఆరు వారాల పూర్తి చేసుకొని ఏడో వారంలోకి అడుగు పెట్టింది. మొత్తం ఆరు వారాలలో 7మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఆరో వారం లో కిరాక్ సీత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 15 మంది కొనసాగుతున్నారు. తాజాగా ఏడో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఎప్పటిలాగే నామినేషన్ లో భాగంగా రచ్చ రచ్చ జరిగినట్లుగా కనబడుతోంది. అయితే ఈ వారంలో బిగ్ బాస్ హౌస్ లో గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి.
China Taiwan: తైవాన్ సరిహద్దులోకి ప్రవేశించిన 153 చైనా మిలిటరీ విమానాలు
ఇక తాజాగా విడుదలైన ప్రమోలో భాగంగా ప్రేరణ, హరితేజలు నామినేట్ చేసేటప్పుడు చెప్పే పాయింట్లు వ్యాలిడ్ అయ్యే విధంగా ఉన్నాయా? లేదా అన్న విషయాన్ని తెలియజేస్తూ నామినేట్ చేయాల్సిందిగా గొడవ జరిగింది. ఇక మరోవైపు గౌతమ్ నబీల్ ల మధ్య మాటలు యుద్ధం కూడా జరిగింది. ఈ సందర్భంగా నబిల్ గౌతమ్ ను ఉద్దేశిస్తూ. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటూ కామెంట్ చేయగా., ఎక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నాను చెప్పు అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత టేస్టీ తేజ నిఖిల్ ఎవరికి వారు మాట్లాడుతూ కనిపించారు.
Sri Vishnu : “అల్లూరి” డిస్ట్రిబ్యూటర్ల న్యాయపోరాటం.. న్యాయం జరిగేనా ?
ఆ తర్వాత ప్రేరణ, యాష్మి లకు సంబంధించిన విషయాలు ప్రోమోలో హైలైట్ గా నిలిచాయి. ఇందులో భాగంగా యష్మీ తనకిష్టం వచ్చినట్టు.. తాను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి..ఎలా గేమ్ ఆడాలి.. ఇది నా గేమ్ అంటూ కాస్త రెచ్చిపోయింది. ఇకపోతే ఈ వారం మొత్తం 9 మంది నామినేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే., తర్వాత ప్రోమో వస్తే కానీ ఎవరు నామినేషన్ లో ఉన్నారన్న విషయం మాత్రం తెలియరాదు.