NTV Telugu Site icon

Bigg Boss 8 Telugu: హీటెక్కిన నామినేషన్స్‌.. వచ్చి రాగానే నామినేషన్స్ లోకి

Bigg Boss

Bigg Boss

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 నాలుగు వారాలు పూర్తిచేసుకుని ఆరవ వారంలో అడుగు పెట్టింది. ఐదవ వారంతో హౌస్ నుంచి 5 మంది ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా 8 మంది వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇకపోతే వైల్డ్ కార్డు ఎంట్రీ జరిగిన తర్వాత జరిగిన ఫస్ట్ నామినేషన్ల ప్రక్రియలో ఆరుగురు సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. అయితే ముందుగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ కు మొదటివారం నామినేషన్ ఉండాలని ముందుగా ప్రచారం జరిగింది. కాకపోతే, ఆ ప్రచారంలో ఎలాంటి నిజాలు లేవు.

IPL 2025 Auction: భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లకు చోటు.. ఐపీఎల్ ప్రాంచైజీలకు పెద్ద బొక్క!

వైల్డ్ కార్డు కంటెస్టెంట్ హరితేజతో ఈసారి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యుని మెడలో ఫోటో వేసి వారిని నామినేట్ చేయడం ఈ వారం నామినేషన్ ప్రక్రియ విధానం. ఇకపోతే మన వైపు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కు రాయల్ క్లాన్ అని పేరు పెట్టి, ముందుగా వచ్చిన ఓల్డ్ కంటెస్టెంట్స్ కు ఓజి క్లాన్ అని పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓజీ క్లాన్ సభ్యులలో ఇద్దరినీ నామినేట్ చేసేందుకు బిగ్ బాస్ ఓజి క్లాన్ సబ్యులకు అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా రాయల్ క్లాన్ సభ్యులలో గంగవ్వతో పాటు మెహబూబ్‌ దిల్ సే లను పాత సభ్యులు నామినేట్ చేశారు.

Atrocious: వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి.. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన

ఈ వారం నామినేట్ అయిన ఆరుగురు సభ్యుల్లో ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు మెహబూబ్‌ దిల్ సే, గంగవ్వ కాగా మిగతా నలుగురు పాత సభ్యుల్లో యష్మి గౌడ, విష్ణు ప్రియ, కిరాక్ సీత, పృథ్విలు నామినేషన్ లో ఉన్నారు. చూడాలి మరి ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారో. ఈసారి ఎక్కువ నామినేషన్స్ యాష్మి గౌడ మీద పడినట్టు సమాచారం.

Show comments