NTV Telugu Site icon

Mohammed Shami: షమీ ఫిట్‌నెస్‌పై బిగ్ అప్‌డేట్.. ఆస్ట్రేలియా టూర్‌కు స్టార్ బౌలర్..!

Mohammed Shami 750 Kg

Mohammed Shami 750 Kg

వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే.. ఈ పర్యటనలో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ టూర్‌లో పాల్గొంటాడా లేదా అనేది అనుమానాలు ఉండేవి. అయితే.. వాటికి షమీ ఫుల్ స్టాప్ పెట్టాడు. తన ఫిట్‌నెస్‌పై షమీ స్వయంగా అప్‌డేట్ ఇచ్చాడు. తాను నొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందానని, ఆస్ట్రేలియా టెస్టు పర్యటనకు దూరం కానని చెప్పాడు.
ఆదివారం బెంగళూరులో న్యూజిలాండ్‌తో భారత్‌తో జరిగిన తొలి టెస్టు తర్వాత.. షమీ నెట్స్‌లో పూర్తి శక్తితో బౌలింగ్ చేశాడు. అయితే.. అంతకుముందు షమీకి మోకాళ్లలో వాపు ఉంది.. ఆస్ట్రేలియా టూర్ కు షమీ ఆడటం కష్టమేనని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

Read Also: The Raja Saab: గళ్ళ కోటు.. నల్ల ఫ్యాంటు.. టీ షర్ట్..బాబు లుక్ అదిరిందంతే!

తన ఫిట్‌నెస్‌పై మహ్మద్ షమీ మాట్లాడుతూ.. “నిన్నటి బౌలింగ్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంతకుముందు నేను హాఫ్ రన్-అప్ నుండి బౌలింగ్ చేశాను. కానీ నిన్న నేను పూర్తి శక్తితో.. 100 శాతం బౌలింగ్ చేసాను. ఫలితం బాగానే వచ్చింది. నేను 100 శాతం నొప్పి లేకుండా ఉన్నాను.’ అని చెప్పాడు. అలాగే.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నట్లు షమీ చెప్పాడు. “ఆస్ట్రేలియా సిరీస్ కోసం చాలా బలంగా ఉండాలి. ఆస్ట్రేలియాలో ఎలాంటి ప్రదర్శన చూపించాలో నాకు తెలుసు. మైదానంలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. నేను ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాను.’ షమీ పేర్కొన్నాడు. కాగా.. గాయం కారణంగా, షమీ నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆడలేదు.

Read Also: Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Show comments