NTV Telugu Site icon

China : చైనాను చావు దెబ్బ కొట్టిన భారత్.. ఆ దేశ టీవీలు, స్మార్ట్‌ఫోన్లను మనోళ్లు కొంటలేరు

India,

India,

China : ఒకప్పుడు చైనీస్ స్మార్ట్‌ఫోన్‌లు అందరినీ ఆకట్టుకునేవి. భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చైనా స్మార్ట్‌ఫోన్లు బడా కంపెనీలను కూడా భయపెట్టాయి. అనేక సంబర్భాల్లో చైనీస్ కంపెనీ Xiaomi కంటే ఆపిల్, శామ్సంగ్ కంపెనీలు వెనుకబడి పోయాయి. అయితే, చైనా ఉత్పత్తుల వృద్ధిని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అసలే ఇప్పుడు ఇండియన్ టెలివిజన్ రంగంతో డ్రాగన్‌కి పెద్ద దెబ్బ తగిలింది. భారతీయ టెలివిజన్ రంగంలో తొలిసారిగా చైనీస్ బ్రాండ్ టెలివిజన్ మార్కెట్ తగ్గింది. LG, Samsung వంటి పెద్ద బ్రాండ్లు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. దీని కారణంగా చైనీస్ టెలివిజన్ మార్కెట్ భారీ నష్టాన్ని చవిచూసింది. మరోవైపు, చైనా దాని ఉత్పత్తుల విశ్వసనీయత భారతదేశంలో కూడా తగ్గింది.

Read Also:iPhone 15 Sale in India: యాపిల్ ‘ఐఫోన్ 15’ సిరీస్ సేల్స్ మొదలు.. డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!

చైనీస్ బ్రాండ్ మొబైల్ ఫోన్లు, టీవీల అమ్మకాలు భారతదేశంలో తగ్గుతున్నాయి. మార్కెట్ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ టెక్నాలజీ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. చైనాకు చెందిన ప్రముఖ టెలివిజన్ బ్రాండ్‌లు OnePlus, Real Me త్వరలో భారతీయ మార్కెట్‌ను వదిలివేయవచ్చు లేదా వాటి మార్కెట్‌ను తగ్గించవచ్చు. ప్రస్తుతానికి వన్‌ప్లస్, రియల్ మీ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం లేదు. వాస్తవానికి ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో చైనీస్ బ్రాండ్‌ల టీవీ షిప్‌మెంట్‌లు 33.6శాతం పడిపోయాయి. గతేడాది ఈ సంఖ్య 35.7 శాతంగా ఉంది. జూలై, ఆగస్టులలో కూడా చైనీస్ బ్రాండ్ల అమ్మకాలు 30 నుండి 33శాతం వరకు క్షీణించాయి. ప్రజలు ఇప్పుడు సామ్‌సంగ్, ఎల్‌జి, సోనీ కంపెనీలకు చెందిన మిడ్-సెగ్మెంట్, ప్రీమియం మోడళ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా, Sansui , Acer వంటి బ్రాండ్‌లపై కస్టమర్ల ఆసక్తి కూడా పెరుగుతోంది.

Read Also:Rakul Preet Singh: కాటుక కాళ్ళతో మాయచేస్తున్న..రకుల్ ప్రీత్ సింగ్

Samsung, LG, Sony నుండి మిడ్-సెగ్మెంట్, ప్రీమియం మోడళ్లకు వినియోగదారుల ప్రాధాన్యత కారణంగా చైనీస్ బ్రాండ్‌ల షిప్‌మెంట్‌లు తగ్గుముఖం పట్టాయి. చైనీస్ బ్రాండ్లు నాలుగు త్రైమాసికానికి పైగా స్మార్ట్‌ఫోన్‌లలో మార్కెట్ వాటాను కోల్పోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కూడా చైనా బ్రాండ్లు గత నాలుగు త్రైమాసికాలుగా మార్కెట్ వాటాను కోల్పోతున్నాయి. వారు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ నుండి బయటకు వస్తున్నారు. ఇటీవలి వరకు రూ. 7,000 నుండి రూ. 8,000 కంటే తక్కువ ఉన్న వర్గం చైనా కంపెనీల ఆధిపత్యంలో ఉంది. ఇప్పుడు వారు తమ మార్జిన్‌లను పెంచుకోవడానికి Samsung, Apple ఇతర కంపెనీలతో మిడ్ టు ప్రీమియం సెగ్మెంట్‌పై దృష్టి సారిస్తున్నారు.

Show comments