NTV Telugu Site icon

Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Konda Surekha

Konda Surekha

మంత్రి కొండా సురేఖకు మరో దెబ్బ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో.. వెంటనే కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేశారు. ఈ క్రమంలో వాదనలు జరగగా.. కొండా సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌ను ప్రజా ప్రతినిధుల కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కొండా సురేఖకు సమన్లు జారీ చేసిన కోర్టు.. 356 BNS యాక్ట్‌ కింద మంత్రి సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కేసు నమోదు చేసింది. అంతేకాకుండా.. డిసెంబర్ 12 తేదీన హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Tirupati Laddu Controversy: శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..! దూకుడు పెంచిన సిట్

అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకుల విషయంలో గతంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో.. నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపి కోర్టు మంత్రి కొండా సురేఖకు సమన్లు పంపించింది. కాగా.. ఈ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు గానూ సమంతకు మంత్రి క్షమాపణలు చెప్పారు.

Read Also: Telangana: పదో తరగతి పరీక్షల్లో మార్పులు.. ఇకపై 100 మార్కుల పేపర్

Show comments