Street Girlfriends Trend In China: ప్రస్తుతం చైనాలో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదికూడా ఒంటరిగా ఉన్న అబ్బాయిల కోసమే. సాదాసీదా ఆఫర్ కాదండోయ్.. మతిపోయే ఆఫర్.. అదేంటంటే.. సింగిల్స్ కోసం అద్దెకు గర్ల్ ఫ్రెండ్ ను తీసుకోవచ్చు. ఔను.. మీరు విన్నది అక్షరాలా నిజం. కాకపోతే ఈ ఆఫర్ భారత్లో కాదండి., చైనాలో. ఆ దేశంలో స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ ప్రస్తుతం తెగ ఊపందుకుంది. ఆ దేశ యువతులు ఏకంగా వీధుల్లో స్టాళ్లు ఏర్పాటు చేసుకుని మరీ ‘లవ్ మీ ఇఫ్ యూ కెన్’ అంటున్నారు. ముఖ్యంగా ఇది సింగిల్స్ కుర్రాళ్ల కోసమట. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతోంది. ఓ చైనా స్థానిక మీడియా నివేదిక ప్రకారం, చైనాలో స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ వేగంగా ఊపందుకుందని., ఇందులో సింగిల్స్ కుర్రాళ్లు ఈ ట్రెండ్ కు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని పేర్కొంది.
Realme 13 Pro Series: ఏఐ కెమెరా ఫీచర్‌తో రియల్‌మీస్మార్ట్‌ఫోన్స్.. ధర, బ్యాటరీ డీటెయిల్స్ ఇవే!
ఈ ట్రెండ్ లో వారికి ఓ హాగ్, ఒక కిస్.. అంతేకాదండోయ్.. సినిమాకు కూడా వెళ్తున్నారట.. ఈ స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్స్. చైనా దేశంలోని షెన్‌జెన్ నగర వీధుల్లో ఈ స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ దందా ఎక్కువగా కనపడుతుంది. ఎవరైనా ఒంటరిగా ఫీల్ అయ్యే సింగిల్ అబ్బాయిలు వారి దగ్గరకు వస్తున్నారని అక్కడి స్థానిక అమ్మాయిలు అంటున్నారు. ఇకపోతే ఈ స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ సేవలకు కూడా ఛార్జ్ వసూలు చేస్తున్నారు. మరి ఏ సర్వీస్ కు ఎంత ఛార్జ్ చేస్తున్నారో చూస్తే.. మొదటగా ఓ కౌగిలింతకు 1 యువాన్ అంటే.. 11 రూపాయలు, అలాగే ముద్దుకు 10 యువాన్స్ అంటే 110 రూపాయలు.., ఇంకా సినిమా చూడటానికి 15 యువాన్స్ అంటే రూ.150 చెల్లించాలి. అంతేకాదండోయ్.. ఇంటికి తీసుకెళ్లి మరి ఇద్దరూ కలిసి మద్యం సేవించాలంటే.. అందుకు గాను ఏకంగా గంటకు 40 యువాన్స్ అంటే రూ. 461 చెల్లించాలట. దాంతో ఇప్పుడు ఈ చైనా స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారింది.
NTR Bharosa Pensions: రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ.. రూ.2,737.41 కోట్లను విడుదల చేసిన సర్కార్..