Bank Fraud: గుంటూరులోని జీడీసీసీ బ్యాంకులో ఒక్కొక్కటిగా స్కామ్స్ వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకులో రుణాల పేరుతో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు ప్రచారం కొనసాగుతుంది. రైతులు కాని వారి ఆధార్ కార్డులు సేకరించి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి, రైతుల రుణాల పేరుతో బ్యాంకు సొమ్మును స్వాహా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.