Fraud: సైబరాబాద్‌లో బిగ్ స్కాం.. రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన సంస్థ
- సైబరాబాద్ పరిధిలో వెలుగుచూసిన భారీ స్కాం
- రూ. 300 కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసిన సంస్థ
- కూకట్ పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో బడా మోసం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబరాబాద్ పరిధిలో భారీ స్కాం వెలుగుచూసింది. రూ.300 కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. కూకట్‌పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో బడా మోసానికి పాల్పడింది. ఈ మోసంలో 3600 మంది బాధితులు చిక్కుకుపోయారు. తమ కంపెనీలో 8 లక్షల 8 వేల రూపాయలు కనీస పెట్టుబడిగా పెట్టి.. రెండు గుంటల స్థలాన్ని కొనుగోలు చేస్తే, 25 నెలల పాటు ప్రతి నెలా 4 శాతం చొప్పున అంటే నెలకు రూ.32 వేలు చెల్లిస్తామని జోరుగా ప్రచారం చేశారు. అంతేకాకుండా.. ఈ స్కీమ్‌లో మరెవరినైనా చేర్పించినా వారికి 25 నెలల పాటు ప్రతి నెలా రూ.7200 చొప్పున చెల్లిస్తామని ఆశ చూపింది 12 వెల్త్ సంస్థ.
Read Also: Kollywood : తమిళ సెలబ్రిటీల వరుస విడాకులు.. ఎందుకంటే?
Also Read
- Tragedy : నాన్న చేతిలోనే నలిగిన బాల్యం.. అర్మాన్ మృతి..
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
- Balloon Gas Cylinder Blast : మియాపూర్‌లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
ఇదేగాక.. డబుల్ గోల్డ్ స్కీమ్‌లో కనీసం రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే 12 నెలల తరువాత రూ.8 లక్షల విలువ చేసే స్విట్జర్లాండ్ గోల్డ్ బిస్కెట్ ఇస్తామని ట్రాప్ చేశారు. అంతేకాకుండా.. గోల్డ్ చిట్ స్కీమ్ పేరుతో మరో వల వేశారు. 5 లక్షల రూపాయలను 20 నెలల పాటు పెట్టుబడిగా పెడితే 19 నెలల పాటు నెలకు 15 వేల చొప్పున ప్రతి నెలా చెల్లిస్తామని.. 20వ నెల మరో 15 వేలు అదనంగా చెల్లిస్తామని నమ్మించారు కేటుగాళ్లు. ఈ క్రమంలో 3600 మంది బాధితులు పెట్టుబడి పెట్టి మోసపోయారు.
Read Also: Isaral-Hamas War: బందీలను తీసుకురండి, రూ.37.5 కోట్లు పట్టుకెళ్లండి.. నెతన్యాహూ సూపర్ డీల్..
తాము మోసపోయామని తెలుసుకుని సైబరాబాద్ EOW పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఈ క్రమంలో.. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రై.లి. ఎండీ కలిదిండి పవన్ కుమార్ సహా మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. 12 వెల్త్ అనుచరులు కొందరు అరాచకాలకు దిగారు. పోలీసులను ఆశ్రయించిన బాధితులను భయాందోళనకు గురి చేస్తూ అరాచకాలు చేశారు. కంప్లైంట్ చేస్తే డబ్బులు ఇవ్వమంటూ బెదిరించారు. ప్రస్తుతం వల్లభనేని రవికుమార్ చౌదరి, కాకర్ల గిరిబాబు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
-
Tragedy : నాన్న చేతిలోనే నలిగిన బాల్యం.. అర్మాన్ మృతి..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
-
Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!