మరొక రెండు రోజుల్లో రిలీజ్ అవుతుందనుకున్న టైమ్ లో ఊహించని విధంగా రిలీజ్ వాయిదా పడింది జననాయగన్. సెన్సార్ టీమ్ నుండి సర్టిఫికేట్ రాకపోవడంతో విజయ్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. అప్పటికే భారీ మొత్తంలో టికెట్ల విక్రయించిన థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకులకు తిరిగి డబ్బులు వాపస్ కూడా చేసింది. దళపతి విజయ్ జననాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. జననాయగన్ సినిమా సెన్సార్పై కీలక ఆదేశాలు.. సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని CBFCకి ఆదేశాలుజారీచేసింది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ రివ్యూ కమిటీకి ఎందుకు పంపారని ప్రశ్నించింది మద్రాస్ కోర్టు. ముందుగా ఇస్తామన్న U/A సర్టిఫికేట్ను వెంటనే ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో జననాయగన్ విడుదలకు అన్ని మార్గాలు సుగమం అయ్యాయి. కోర్టు ఆదేశాల ప్రకారం సెన్సార్ టీమ్ ఇప్పటికైనా సర్టిఫికెట్ ఇస్తుందో మరేదైనా కారణం చెప్తుందో చూడాలి.