NTV Telugu Site icon

Chandrababu: చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మిణి, పయ్యావుల కేశవ్ ములాఖత్

Mulakath

Mulakath

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మిణి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ములాఖత్ అయ్యారు. 40 నిమిషాల పాటు ములాఖత్ సాగింది. ఇదిలా ఉంటే చంద్రబాబు 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. కోర్టు తీర్పులు, లోకేష్ సిఐడి విచారణ, పార్టీ వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబుతో చర్చించారు.

CID Investigation: కాసేపట్లో ముగియనున్న లోకేష్ సీఐడీ విచారణ

ములాఖత్ అనంతరం జైలు బయటకు వచ్చి అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. జైలులో చంద్రబాబును చూసి బాధ కలిగిందన్నారు. కృష్ణా జలాలపై పార్టీ యంత్రాంగం స్లోగా ఉందని.. మీరందరూ చొరవ చూపకపోతే రాష్ట్రానికి చాలా నష్టం కలుగుతుందని చెప్పారని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అన్యాయం జరుగుతుందని.. ఈ కేసులను రాజకీయ కుట్రగా ప్రజలు భావిస్తున్నారని పయ్యావుల అన్నారు. ప్రజల కోసమే జైలులో ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల తరుణంలో టీడీపీని ఇబ్బందుల్లో పెట్టాలని చూస్తున్నారని.. జగన్ ప్రభుత్వ పతనం ఖాయమని ఆయన ఆరోపించారు.

Israel-Hamas: ఇజ్రాయిల్‌పై దాడిలో మా ప్రమేయం లేదు.. ఇరాన్ సుప్రీం లీడర్ కీలక వ్యాఖ్యలు..

ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు రాజకీయంగా బలంగా ఉన్న టీడీపీని దెబ్బతీయడానికి ఈ ప్రయత్నం చేసిందని పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా 54 దేశాల్లో జనం ఆందోళన చేశారని.. చంద్రబాబు వెనకాల లక్షల మంది జనం ఉన్నారని తెలిపారు. అవినీతి జరగలేదు, కక్షపూరితంగానే చంద్రబాబును అరెస్టు చేశారని జనం నమ్ముతున్నారన్నారు. ఈ రాష్ట్రానికి జగన్ అవసరం లేదు…. ఏపీ హేట్స్ జగన్ అంటున్నారని కేశవ్ తెలిపారు. నిక్కరేసుకున్న కుర్రోడు కూడా చెబుతాడు… కక్షపూరితంగా చంద్రబాబునాయుడుని అరెస్టు చేశారని అని అన్నారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ పై మానసికంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని… బాబు భద్రత వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని , కోర్టులను కోరుతామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.