Site icon NTV Telugu

Bhumana Karunakar Reddy : విమర్శలకు భయపడేవాడిని కాదు

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

విమర్శలకు భయపడేవాడిని కాదని, నేను నాస్తికుడిననే విమర్శలు చేసే వారికి ఇదే నా సమాధానమన్నారు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తిని అని ఆయన అన్నారు. దేవుడి దయతో మతాంతీకరణలు ఆపడానికి 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా.. తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తీసుకుంది నేనే అని ఆయన వ్యాఖ్యానించారు. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ నేనే అని ఆయన వెల్లడించారు. దళితవాడలకు శ్రీవెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళి కళ్యాణం చేయించింది నేనే అని భూమన కరుణాకర్‌ రెడ్డి వివరించారు.

Also Read : Fake Pilot: అమ్మాయిల కోసమే పైలెట్ అవతారం.. పలువురిని మోసం చేసిన యువకుడు

నా మీద క్రిస్టియన్ అని నాస్తికుడనని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానమన్నారు భూమన కరుణాకర్‌ రెడ్డి. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపే వాడిని కాదని, పోరాటాల నుండి పైకి వచ్చిన వాడిని ఇలాంటి వాటికి భయపడనని భూమన కరుణాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో జరిగిన మూడు తరాల మనిషి పుస్తకావిష్కరణ సభలో విమర్శలకు ఈ విధంగా సమాధానం చెప్పారు భూమన కరుణాకర రెడ్డి. మరోవైపు, ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. టీటీడీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.

Also Read : Saif Ali Khan Son : కొడుకు డెబ్యూ సినిమా విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నా సైఫ్‌

Exit mobile version