Fake Pilot: అమ్మాయిల కోసమే పైలెట్ అవతారం.. పలువురిని మోసం చేసిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Pilot:ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో మోసలకు పాల్పడటం ఎక్కువై పోయింది. పెద్ద ఉద్యోగం చేస్తున్నానంటూ యువతులను చాలా మంది అబ్బాయిలు మోసం చేస్తున్నారు. కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిలను మోసం చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తాను పైలెట్ అని చెప్పి నలుగురు అమ్మాయిలను మోసం చేశాడు. అయితే అతడిని పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇంతకీ అతనిపై అమ్మాయిలు ఫిర్యాదు చేయలేదు. అతనంతట అతనే పోలీసులకు చిక్కడంతో విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చాయి.
Also Read: Delhi Metro: మెట్రోలో రెచ్చిపోయిన అబ్బాయి.. మొదట ఓ అమ్మాయితో తరువాత ఇంకో అమ్మాయితో
వివరాళ్లోకి వెళ్తే గుజరాత్ కు చెందిన రక్షిత్ మంగేలా అనే 20 ఏళ్ల యువకుడు హైదరాబాద్ లో ఉన్న తన ప్రియురాలిని కలిసేందుకు వెళుతూ వడోదర ఎయిర్ పోర్ట్ లో అధికారులకు చిక్కాడు. పైలెట్ డ్రస్ లో ఎయిర్ పోర్ట్ లో వెళుతుండగా బోర్డింగ్ సిబ్బందికి అనుమానం వచ్చి విచారించారు. దాంతో తాను ఎయిర్ ఇండియా పైలెట్ ను అంటూ అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో వారు రక్షిత్ ను పోలీసులకు అప్పగించారు. హర్ని పోలీసు స్టేషన్ లో ఆ యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా పోలీసు విచారణలో పలు విస్తుపోయే విషయాలు తెలిశాయి. కేవలం అమ్మాయిలను ప్రేమలో పడేసేందుకే ఆ యువకుడు నకిలీ పైలెట్ అవతారం ఎత్తినట్లు తేలింది. అతడికి రాజ్ కోట్, ముంబాయి, అహ్మదాబాద్, హైదరాబాద్ తో సహా నెదర్లాండ్ లో కూడా లవర్స్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. 20 ఏళ్ల వయసులోనే ఇంత మందితో పైలెట్ అని చెప్పి ప్రేమాయణం నడపడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రలకు జరిగిన విషయానంత చెప్పి అప్పగించారు. అంతేకాకుండా అతని గర్ల్ ఫ్రెండ్స్ కు నేను నకిలి పోలీసును అంటూ అతని చేతే మెసేజ్ కూడా పెట్టించారు. ఇక పోలీసుల విచారణలో రక్షిత్ మరో విషయాన్ని కూడా వెల్లడించాడు. తాను చిన్నప్పటి నుంచి నిజంగానే పోలీసు కావాలని అనుకున్నానని కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంతో కాలేకపోయానని అందుకే పైలెట్ అనే అబద్ధం చెప్పానని రక్షిత్ తెలిపాడు. అయితే ఇలా నకిలీ ఐడెంటిటీతో మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read
- India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు.. ఆసియా కప్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా?
- Shubman Gill: ‘135 పరుగులే కదా.. ఈజీగా ఛేజ్ చేయొచ్చనుకున్నా కానీ’.. భారత్ థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ రియాక్షన్..
- Konaseema: తండ్రి వైసీపీ.. కూతురు టీడీపీ.. ఎన్నికల్లో ఇద్దరూ గెలుపు..
- Cheyutha Pensions: గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..
తాజావార్తలు
-
Diwali Horoscope 2026: దీపావళి రోజు దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Japan Earthquake: జపాన్‌లో 5.7 తీవ్రతతో భారీ భూకంపం.. 22 మందికి గాయాలు
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు.. ఆసియా కప్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా?
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!