ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సెటైర్లు వేశారు. రైతులకు న్యాయం చేయకుండా.. పవన్ నిద్రపోతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంత కాలం పవన్ నిద్రపోతానే ఉంటారు ఏమో? అని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదున్నారు. 1995లో సీబీఎన్ బాగుండేదని.. ఇప్పటి సీబీఎన్ చాలా దారుణం అని విమర్శించారు. చంద్రబాబు మామిడి రైతుల సమస్యలు తీర్చకుండా వైసీపీ నేతలను తిట్టుకుంటూ కూర్చున్నాడని భూమన మండిపడ్డారు.
తిరుపతిలో మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక మామిడి రైతులు అల్లాడిపోతున్నారు. లక్షల హెక్టార్లలో వేసిన మామిడి పంటను ఎమీ చేసుకోవాలో తెలియక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. సీఎం చంద్రబాబు మామిడి రైతులకు తీరని ద్రోహం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం పైన కేంద్రం ప్రభుత్వం ఉంది, బాబు ఎందుకు అడగలేదు. కర్నాటకలో జేడీఎస్ పార్టీ అధినేత కూమారస్వామీ మామిడి రైతులను ఆదుకోవాలని కేంద్రం మంత్రి శిరాజ్ సింగ్ చౌహన్‌కు లేఖ రాశారు. 16 రూపాయల లెక్కన రెండున్నర మెట్రిక్ టన్నుల మామిడి కొనటానికి అంగీకరించినట్లుగా తిరిగి లేఖ రాశారు. మరి ఏపీలో ఎంపీలు ఏం చేస్తున్నారు. వారికంటే ఎక్కవగా ఎంపీలు ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఏమి చేస్తున్నాయి’ అని అన్నారు.
Also Read: Ravindra Jadeja: రవీంద్ర జడేజా చరిత్ర.. ప్రపంచంలోనే ‘ఒకే ఒక్కడు’!
‘పవన్ కళ్యాణ్ మాట్లాడటం మానేసి చాలా రోజులు అయ్యింది. 12 రూపాయలని చెప్పడమే కానీ ఇచ్చింది సగం కూడా లేదు. ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రూపాయిలు చాలా తక్కువ. అతి తక్కువ ఎంపీలు ఉన్న జేడీఎస్ పార్టీ ఆడిగిన వెంటనే కేంద్రం రెండున్నర మెట్రిక్ టన్నుల మామిడిని 16 రూపాయిలు లెక్కన కొనింది. చంద్రబాబు మాత్రం అబద్దాలు చెబుతూ రైతులను ముంచాడు. 1995 సీబీఎన్ అయినా కొద్దోగొప్పో బాగుండేది. ఇప్పుడు సీబీఎన్ మరింత దారుణం తయారు అయ్యాడు. మామిడి రైతుల సమస్యలు తీర్చకుండా వైసీపీ నేతలను తిట్టుకుంటూ కూర్చున్నాడు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల అల్లాడుతుంటే.. జీడి నెల్లూరు ఎమ్మెల్యే ధామస్ మాత్రం పుట్టిన రోజుకు కోట్లు ఖర్చు పెట్టి చేసుకున్నాడు. పక్కన రైతుల ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలతో హాంగామా చేశాడు. మీరు ఎన్ని ఆంక్షల పెట్టినా జగన్ జిల్లాకు వచ్చి మామిడి రైతులను పరామర్శిస్తారు. అసత్య ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట. జగన్ ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ నిద్రపోయి చాలా కాలం అయ్యింది. చంద్రబాబు సీఎంగా ఉన్నతకాలం పవన్ నిద్రపోతానే ఉంటారేమో’ అని భూమన విమర్శలు చేశారు.
