Site icon NTV Telugu

Bhuma Akhila: రెడ్ బుక్‌ను తలుచుకొని జగన్ భయపడుతున్నారు.. భూమా అఖిల ఫైర్…

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

వైసీపీ పై భూమా అఖిల ఫైర్ అయ్యారు.. వైసీపీ వెన్నుపోటు దినంతో ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. తాజాగా నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. “వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు… మద్య నిషేధం పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారు… వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత సోదరికి వెన్నుపోటు పొడిచారు.. సొంత చెల్లిని, తల్లిని బయటికి గెంటేసి జగన్ వారికి వెన్నుపోటు పొడిచారు.. రైతులకు, రాష్ట్రానికి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైసీపీ నాయకులే.. వైసీపీ వెన్నుపోటు పొడిచిందనే ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారు.. రఘురామ కృష్ణంరాజును అత్యంత దారుణంగా కొట్టి హింసించి కనీసం మెడికల్ ట్రీట్మెంట్ కోసం కూడా సహకరించలేదు.. అమర్నాథ్ గౌడ్ అనే బాబును అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి అంటించి చంపినప్పుడు ఏం చేసింది వైసీపీ?” అని ఆమె ప్రశ్నించారు.

READ MORE: Sri Sri Sri Raja Vaaru Review: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ రివ్యూ

ఏ రోజు అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో జీతం తీసుకుంటున్నారని ఎమ్మెల్యే భూమా అఖిల ఆరోపించారు.. వైసీపీ నేతలు నేరాలకు కూడా కులాలు మతాలు తీసుకొస్తున్నారని… ఎంతోమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నా పరామర్శించని జగన్ గంజాయి బ్యాచ్ లను పరామర్శించడానికి వెళ్లారని విమర్శించారు.. వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ గంజాయి పట్టుకున్న ఒక్క మాట కూడా జగన్ మాట్లాడలేదన్నారు. రెడ్ బుక్కును తలుచుకొని జగన్, వైసీపీ నేతలు భయపడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.. తాము ఇంకా బతికున్నాము అని తెలియజేయడానికే వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం ర్యాలీని చేపట్టారా? అని ప్రశ్నించారు.

READ MORE: AP Government: ఏపీ సర్కార్‌ కసరత్తు.. ఇక, రేషన్‌ బదులు నగదు..!

Exit mobile version