NTV Telugu Site icon

Ram Mohan Naidu: భోగాపురం ఎయిర్పోర్టును జెట్ స్పీడ్లో పూర్తి చేస్తా..

Rammohan

Rammohan

Union Minister Rammohan Naidu: పౌర విమానయాన శాఖ నాకు ఏరి కోరి ప్రధాని మోడీ అప్పగించారు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడంలో ఈ శాఖ పాత్ర చాలా ఉంది.. యువకుడివి, విదేశాలు తిరిగావు, ఇంజనీరింగ్ విద్యాభ్యాసం ఉంది.. కాబట్టి ఈ శాఖను నీకు ఇస్తున్నాను అంటూ ప్రధాని చెప్పారు.. ఈ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విమానయాన మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, కొత్త అవకాశాలను వెతకడం సాధ్యపడుతుంది అని ఆయన చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రికార్డు సమయంలో పూర్తి చేస్తాం.. విమానయాన శాఖలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారిస్తాం.. విమానయాన శాఖ మంత్రిగా పని చేసిన జ్యోతిరాధిత్య సింధియాను కలిసి ఆయన అనుభవాలను తెలుసుకుంటాను.. మంత్రిని బట్టి శాఖ పని తీరు ఉంటుందని అనేక మంది చెబుతున్నారు.. అందుకు తగ్గట్టే పౌర విమానయాన శాఖను డ్రైవ్ చేస్తాను అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Read Also: Darshan Arrest: హత్య కేసు.. ప్రముఖ కన్నడ నటుడు అరెస్ట్!

ఇక, పొరుగునే ఉన్న తెలంగాణలో కూడా విమానయాన రంగానికి తోడ్పాటు అందిస్తాను అంటూ రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజల మనసు గెలుచుకునేలా పని చేస్తాను.. రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉంటే కేవలం పౌర విమానయాన శాఖ మాత్రమే కాదు.. 30 శాఖలకు సంబంధించి ఏ పనులున్నా నేను చొరవ తీసుకొని పని చేస్తా.. పార్లమెంటేరియన్ గా గత పదేళ్లుగా వివిధ శాఖలకు సంబంధించి ఢిల్లీలో అందరినీ కలుస్తూనే ఉన్నాను.. గత పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే 30 శాఖలు మన చేతిలో ఉండాలి అని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవ పరిస్థితిలో అది సాధ్యపడదు.. కానీ మిగతా శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవచ్చు అన్నారు. గతంలో పార్లమెంటులో రెండు నిమిషాల సమయం కోరాను.. కానీ ప్రజలు 21 మంది కూటమి ఎంపీలను గెలిపించి మాకు అధికారం అప్పగించారు.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మంచి పేరు తెచ్చుకునేలా పనిచేస్తాను.. అత్యంత చిన్న వయస్సు క్యాబినెట్ మంత్రిగా అందరి దృష్టి నాపై ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే వ్యవహరిస్తాను అంటూ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.