Gopichand Says I Will definitely do a movie with Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు నుంచే ప్రభాస్‌తో గోపీచంద్‌కు పరిచయం ఉంది. ‘వర్షం’ సినిమాతో ఆ స్నేహం మరింత బలపడింది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. ఇద్దరు తరచుగా కలుసుకుంటారు. ఆ మధ్య బాలయ్య బాబు హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ షోకు కూడా ప్రభాస్, గోపీచంద్ కలిసి వెళ్లారు. ఆ షోలో ఇద్దరు కలిసి పలు విషయాలు పంచుకున్నారు. తాజాగా ‘ఆలీతో సరదాగా’ షోలో పాల్గొన్న గోపీచంద్.. ప్రభాస్‌తో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడు.
గోపీచంద్ నటించిన త్తజా చిత్రం ‘భీమా’. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో గోపీచంద్ పాల్గొని పలు విశేషాలు పంచుకున్నారు. ‘ప్రభాస్ నీకు క్లోజ్ ఫ్రెండ్ కదా.. ఆయన పెళ్లి ఎప్పుడు?’ అని ఆలీ అడగ్గా.. ‘పెళ్లి గురించి మాత్రం నాకు తెలియదు’ అని గోపీ సమాధానం ఇచ్చాడు. ప్రభాస్ సినిమాల్లోకి రాకముందే మా మధ్య పరిచయమైంది. వర్షం సినిమాతో మా స్నేహం మరింత బలపడింది. ఇద్దరం కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నాం. ప్రభాస్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. తప్పకుండా మేం కలిసి సినిమా చేస్తాం’ అని గోపీచంద్ తెలిపాడు.
ఎ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన సినిమా భీమా. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మార్చి 8న విడుదలవుతోంది. భీమా పక్కా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్ ఇలా అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో గోపీచంద్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై గోపీ భారీ ఆశలు పెట్టుకున్నారు.