Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: ఎల్‌నినో వల్ల దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని.. విద్యుత్‌కి సంబంధించి రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా 19,892 మెగావాట్ల డిమాండ్ ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కర్ణాటక పెద్ద రాష్ట్రం, వాళ్ళ డిమాండ్ 20 వేల మెగావాట్ల.. కానీ మన రాష్ట్రంలో విద్యుత్ పీక్‌కి డిమాండ్ పెరిగిందన్నారు. అయినా.. ఎలాంటి ఇబ్బంది కట్స్ లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్తు వినియోగంపై తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇబ్బందుల్లో కూడా జాగ్రత్తగా విద్యుత్ అందిస్తున్న సిబ్బందిని అభినందించాల్సింది పోయి.. కొందరు నాయకులు తప్పుడు మాటలు చెప్పి తప్పుడు తోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అందుకే ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్‌ను నమ్మే పార్టీ అన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా.. పదేళ్లు మంత్రిగా చేసిన మీరు రాష్ట్రానికి నష్టం చేకూరేలా మాట్లాడుతున్నారన్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు.. మీకు మీరే ప్రైవేటేజేషన్ చేస్తున్నారని చెప్పడం సరికాదు. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్‌రావుపై విరుచుకుపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి ఏదో మాట్లాడారు. యాదాద్రి పవర్ ప్లాంట్ డీపీఆర్ ఉందా..? కనీసం కోల్ లింకేజ్ ప్లాన్ చేశారా? అని ప్రశ్నించారు. నది లేకుండా.. హైడల్ పవర్ కడితే ఎలా ఉంటుందో.. కోల్ లేకుండా థర్మల్ పవర్ పెడితే అంతే అన్నారు. కోల్ లేకుండా యాదాద్రి థర్మల్ పవర్ ఎలా కట్టారని ప్రశ్నించారు. స్టార్టింగ్ నుంచి కోల్ లేకుండా యాదాద్రి పవర్ ప్రాజెక్టు కట్టి.. రాష్ట్రం మీద భారం వేశారన్నారు.
కోల్ అలాట్ మెంట్ చేయించలేక పోయింది మీరు. 7 శాతమే ఇస్తాం అని ఒప్పందం చేసింది మీరే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత ప్రభుత్వాన్ని విమర్శించారు.. జెన్ కో నే పూర్తిగా సప్లై చేస్తుంది అని మరో ఒప్పందం అంటూ కాగితాల మీద అబద్ధాలు రాసింది గత ప్రభుత్వమని ఆరోపించారు. “సింగరేణిలో లేకుంటే.. కేంద్రం కోల్ బ్లాక్స్ నుంచి తెద్దాం అని ప్రయత్నం అయినా చేశారా? సింగరేణికి ఆదేశాలు అయినా ఇచ్చారా? కోల్ బ్లాక్‌లోకి ఆక్షన్ లేకుండా ఆపేసింది మీరు. ఉన్న కోల్ బ్లాక్స్‌లో14 మూత పడ్డాయి. యాక్షన్‌లోకి వెళ్తే కొన్ని బ్లాకులు అయినా వచ్చేవి. మీరు అసలు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. సింగరేణి కోల్ తగ్గింది అంటున్నారు. 2025 లో 62.07 మెట్రిక్ టన్నులు అమ్మింది సింగరేణి. 14 బ్లాకులు క్లోజ్ అయినా.. 62 మెట్రిక్ టన్నులు తీశాం అంటే తక్కువా ..? ఎక్కువా..? విశాఖ పట్నం, కృష్ణపట్నం నుంచి కోల్ ఇవ్వండి అని 2016లో రైల్వేకి లేఖ రాశారు. ఇదైనా చేశారా అంటే అదీ లేదు. మీరు మొదలు పెట్టారు కానీ ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారా..? 50 శాతం ఇప్పుడు కోల్ వాడతాం అని.. మిగిలినది ఇంపోర్ట్ చేసుకుంటాం అని చెప్పారు. తర్వాత 100 శాతం సింగరేణి నుంచి తీసుకు వచ్చే ప్లాన్ చేస్తుంది అని కోర్టులో కేసు వేశారు. దాన్ని మీరు హ్యాండిల్ చేశారా? మేం అధికారంలోకి వచ్చాక పబ్లిక్ హియరింగ్ పెట్టాం. 2017 వరకే ప్లాంట్ ఇస్తాం అన్నారు. 2023 వచ్చినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు క్లియర్ చేయించి ప్లాంట్ పూర్తి చేశాం. కిందా మీద పడి కోల్ సప్లై చేస్తున్నాం. 2025లో 2 యూనిట్లు, 2026లో రెండు యూనిట్లు మొదలు పెట్టాం. చేసే తప్పులు చేసి.. తగుదునమ్మా అని మాట్లాడుతున్నారు.” అని విమర్శించారు.
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
“హరీష్ మాటలు చూస్తుంటే నవ్వాలా..? ఏడవాలో అర్థం కావడం లేదు. వారానికి ఒకటి మీ తప్పులు ఆధారాలతో సహా బయట పెడతా. యాదాద్రి పవర్ ప్లాంట్‌కి వేరే వాళ్ళకు ఇచ్చిన బొగ్గు వాడుకుంటున్నాం. నైనీ బ్లాక్ కనీసం పట్టించుకోలేదు మీరు. నేను వెళ్ళి ఒప్పించి.. మైనింగ్ మొదలు పెట్టాం. అక్కడి నుంచి యాదాద్రికి కోల్ ఇస్తున్నాం. జయపూర్ ప్లాంట్‌కి.. అలాట్ చేసిన వాళ్ళకు మాత్రమే నైని నుంచి ఇవ్వగలం. కేంద్రానికి లేఖలు రాసి కోల్ అలాట్ చేసుకుంటున్నాం. మీరు చేసిన తప్పులు సరిదిద్దుతూ పవర్ ప్లాంట్ నడిపిస్తున్నాం. యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి తక్కువ ధరకు విద్యుత్ వస్తుందా అంటే అది కూడా లేదు. యూనిట్‌కి రూ.6.60 పైసలు పడుతుంది. కాకతీయ నుంచి రూ.4.97 పడుతుంది. కొత్తగూడ నుంచి రూ.4.62 కి పడుతుంది. ఎవరి మీద పడుతుంది ఈ భారం. మీరు ఏ రకంగా మేలు చేసినట్టు..? యాదాద్రి ప్లాంట్ లైఫ్ టైమ్ 25 ఏళ్లు. రూ. 40 వేల కోట్లు రాష్ట్రం మీద భారం వేశారు మీరు. గ్రిడ్ వచ్చాక.. పవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా పవర్ సప్లై చేయొచ్చు. అది వదిలేసి.. ఇలాంటి ప్లాంట్స్ పెట్టి నష్టం చేసింది మీరు. బ్లాకులో ఏం బొగ్గు దొరికితే అది ఇస్తారు. కానీ జీ9 నుంచి తేవాలి అంటున్నారు. బొగ్గు అందుబాటులో తెచ్చుకోవాల్సిన బాధ్యత అప్పుడు ఎందుకు మర్చిపోయారు. అది దొరక పోతే.. ఇంకో బ్లాక్ నుంచి తెస్తున్నాం. మాకు ప్లానింగ్ ఉంది కాబట్టే సింగరేణిలో ప్లాంట్ పెట్టాం. మేం పెట్టే యూనిట్.. మీరు పెట్టిన యాదాద్రి కంటే తక్కువ ధరకు విద్యుత్ వస్తుంది. అది మా ప్లాన్. థర్మల్ పవర్ ప్రొడక్షన్ తగ్గిస్తున్నారు అంటున్నారు. 89.6 మిలియన్ యూనిట్లు ప్రొడక్షన్ చేశాం.” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!