Site icon NTV Telugu

Bhatti Vikramarka : రాష్ట్రంలో బానిసత్వం.. బాంచన్ దొర అనే సంస్కృతి.. మరోవైపు అణిచివేత

Bhatti Vikramarka

Bhatti Vikramarka

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్‌ పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో పాదయాత్ర నిర్వహించిన భట్టి విక్రమార్క అక్క ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో జరుగుతున్న నష్టాన్ని ఆపడానికి, రైతులు నిరుద్యోగుల కష్టాలు తీర్చడానికి, ఇందిరమ్మ రాజ్యం కోసం… పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎన్నికలు వస్తున్నాయనో, వ్యక్తిగతంగా నాకోసమో ఈ యాత్ర చేయడం లేదని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ… ఆ సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్ర చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అన్ని రకాల విధ్వంసాలను ఆపడం, నిలవరించడం కోసమే పీపుల్స్ మార్చ్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల సంపద ప్రజలకే ఉండాలని, రాష్ట్ర వనరులు రాష్ట్రానికే ఉండాలని… పీపుల్స్ మార్చ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read : Bholaa Shankar: ఇంద్రా తర్వాత ఇప్పుడే… మెగా సంభవం లోడింగ్

బీఆర్ఎస్ ప్రభుత్వము కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రజలకు భ్రమలు మాత్రమే కల్పిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని, బానిసత్వం.. బాంచన్ దొర అనే సంస్కృతి.. మరోవైపు అణిచివేత రాష్ట్రంలో కొనసాగుతుందని ఆయన మండిపడ్డారు. ఆనాటి నిజం చరిత్రకు, పరిపాలనకు.. ఈనాటి కేసీఆర్ పరిపాలనకు పెద్దగా తేడా లేదు అని స్పష్టంగా చెప్పగలనని, భావోద్వేగాల మధ్య తెలంగాణ తెచ్చుకుని.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా.. ప్యాలెస్ లు నిర్మించడం వల్ల ఏం ప్రయోజనమన్నారు. ఆనాడు నిజం పాలనకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన పోరాటం ఎలా మొదలైందో.. అలాగే తెలంగాణలో ఇప్పుడు రైతులు, నిరుద్యోగులు, సబ్బండ వర్గాలు ఆందోళనకు సిద్ధమవుతున్నారని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే… అన్ని సమస్యలకు కాంగ్రెస్ పాలనలోనే పరిష్కారం దొరుకుతుందన్నారు భట్టి. ఉద్యోగాల భర్తీ కోసం వార్షిక క్యాలెండర్ రూపొందిస్తామని, ఉద్యోగాల కల్పన కోసం ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. నిరుద్యోగ భృతి అందిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

Also Read : TV Channel: తెలుగు టీవీ ఛానల్‌లో అర్ధరాత్రి అశ్లీల వీడియోలు.. హ్యాక్ చేసి..

Exit mobile version