NTV Telugu Site icon

Bhatti Vikramarka: ఇది సిద్దిపేట కాదు.. ఖమ్మం గుర్తుపెట్టుకో..

Batti

Batti

ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో మద్దులపల్లిలో శంకుస్థాపన సభలో కాంగ్రెస్ పార్టీ పదికి పది సీట్లు తీసుకొని వస్తుందని మాట్లాడుతున్నారు.. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జాగీరా అని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించారు. ఖమ్మం ముదిగొండ మండల కేంద్రంలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా అంటూ ఆయన పేర్కొన్నారు.

Read Also: Navadeep: నేనెక్కడికి పారిపోలేదు.. నాకు డ్రగ్స్ కేసుతో సంబంధమే లేదు!

ఇది సిద్దిపేట కాదు ఖమ్మం జిల్లా గుర్తుపెట్టుకో హరీష్ రావు అంటూ భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో మీరు ఒక్క సీటు గెలిచింది లేదు మీకెందుకు ఖమ్మం జిల్లా రాజకీయం అని ఆయన వ్యాఖ్యనించారు. తెలంగాణ రాష్ట్రంలో మీకు 90 సీట్లు వస్తాయని అంటున్నారు తెలంగాణ ఏమన్న మీ జాగీరా అని భట్టి విమర్శలు గుప్పించారు. రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని బండకేసి కొట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని ఆయన అన్నారు.

Read Also: Tollywood Drugs case: చిక్కుల్లో బేబీ టీమ్.. డ్రగ్స్ కేసులో నోటీసులు?

ఖమ్మం జిల్లాపై మాట్లాడటం మానేసి నీ ఉద్యోగం నువ్వు సక్రమంగా నిర్వర్తించుకో అని మంత్రి హరీశ్ రావు పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో డాక్టర్లు నర్సుల పోస్టు ఖాళీగా ఉన్నాయి.. అవి ముందు భర్తీ చెయ్యు అంటూ సెటైర్ వేశాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.