Site icon NTV Telugu

Bhatti Vikramarka : ఒడిశాలో నైనీ గని ప్రారంభం.. సింగరేణికి జాతీయ విస్తరణలో కొత్త అధ్యాయం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గనిని వర్చువల్‌గా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ఇంధన శాఖా మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ, ఈ ఘట్టం సింగరేణి కంపెనీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక గని ప్రారంభం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, గర్వానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఒడిశాలో గని ప్రారంభించటం ద్వారా సింగరేణి దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇది సంస్థ యొక్క గ్లోబల్ దిశగా అడుగులు వేయడంలో కీలక ఘట్టమని చెప్పారు. నైనీ గనిలో మొదటి మెట్టు వేయడం ద్వారా వాణిజ్య, పారిశ్రామిక విస్తరణకు మార్గం సున్నీత్యమవుతుందన్నారు.

ఈ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి కంపెనీకి కేటాయించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ వివిధ అనుమతుల కొరత కారణంగా గని ప్రారంభానికి జాప్యం జరిగింది. “ప్రజా ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే, అనుమతులన్నింటికీ కావాల్సిన పచ్చజెండా వచ్చేలా చర్యలు తీసుకున్నాం” అని భట్టి తెలిపారు.

భట్టి విక్రమార్క ఈ సందర్భంగా, ఒడిశాలో Telangana ఆధ్వర్యంలో గని ఏర్పడటం ఒక అరుదైన గౌరవంగా అభివర్ణించారు. ఇది తెలంగాణ మేధావితనానికి, పరిపాలనా నైపుణ్యానికి గుర్తింపుగా నిలుస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి విస్తరించడం ప్రజాపాలనలో నూతన అధ్యాయంగా పేర్కొన్నారు.

“ముందు తరాల కోసం, కొత్త మార్కెట్ల కోసం, సింగరేణి త్వరలో గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోనుంది,” అని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ తత్వానికి అనుగుణంగా పరిశ్రమల ప్రోత్సాహం, కొత్త అవకాశాల సాధన లక్ష్యంగా సింగరేణి ముందుకు సాగుతోందని చెప్పారు.

Ajinkya Rahane: అందుకే నేను రివ్యూ తీసుకోలేదు.. అసలు విషయం చెప్పిన రహానే!

Exit mobile version