NTV Telugu Site icon

Bhatti Vikramarka : మూసీ నిర్వాసితుల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తాం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : హైటెక్స్‌లో NEREDCO ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో.. జరుగుతున్న అభివృద్ధిపై కొన్ని నెలలుగా కావాలనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించాము.. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే అని ఆయన అన్నారు. మంచినీటి ఎద్దడి లేకుండా గోదావరి, కృష్ణ ,మంజీరా నదుల నుంచి తాగునీరు అందిస్తున్నామని, కాలుష్య డ్రైనేజీలు మరమ్మతులు చేసేందుకు 39 ఎస్టీపీలు మంజూరు చేశామని ఆయన అన్నారు. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని ఆలోచనలతో సీఎం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉందన్నారు భట్టి విక్రమార్క. మూసీ నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్స్ నిర్మిస్తాం.. వారు సకల సౌకర్యాలతో ఉండేలా ఏర్పాట్లు చేస్తామని, మూసీ నిర్వాసితుల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని ఆయన తెలిపారు. నిర్వాసితులైన డ్వాక్రా మహిళలకు 1000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం.. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధిని కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

Cobra In Pillow: దిండులో భారీ నాగు పాము.. గూస్‌బంప్స్‌ వీడియో!

హైడ్రా అనుమతులు ఇవ్వదు. హైడ్రా పై కుట్రపూరితంగా విష ప్రచారం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీ వంటి ప్రభుత్వ సంస్థలు అనుమతులు ఇస్తాయని ఆయన అన్నారు. భారతదేశంలో భవిష్యత్తు హైదరాబాద్‌దే అని, మూసీ పునర్జీవనం, RRR, 30 వేల ఎకరాలలో అద్భుతమైన ఫ్యూచర్ సిటీనీ నిర్మిస్తున్నాం. ఎయిర్ పోర్ట్ నుంచి 30 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి చేరుకోవచ్చు. అక్కడ ప్రపంచ స్థాయి యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం, AI ప్రాజెక్టులు చేపడుతున్నాం. 30 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు గ్రీన్ బెల్ట్ గా ఉంటుందన్నారు భట్టి విక్రమార్క. రియటర్లకు బ్యాంకర్లతో ఉన్న సమస్యలపై మేము మాట్లాడం.. త్వరలో SLBC సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇస్తామని, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల మూలంగా రిజిస్ట్రేషన్లలో స్తబ్దత ఏర్పడింది.. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయన్నారు భట్టి విక్రమార్క.

MLA Brahmananda Reddy: నాపై విచారణ చేయించమని ప్రభుత్వాన్ని కోరుతున్నా.. జూలకంటి సంచలన వ్యాఖ్యలు

Show comments