NTV Telugu Site icon

Bhatti Vikramarka : ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. త్వరలో తిరుగుబాటు రానుంది

Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఇన్నాళ్లు ప్రజలకు న్యాయం చేయలేక పోయాను అనే బాధ కలిగిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. హాత్‌ సే హాత్‌ జోడో పేరిట ఆయన పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్ర లో ప్రజల సమస్యలు చూస్తుంటే.. ఎంతో ఆశతో ప్రజలు ఉన్నారని తెలుస్తోందన్నారు. అడవి బిడ్డలను … అడవి నుండి దూరం చేస్తుంది ఈ ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, త్వరలో తిరుగుబాటు రానుందని ఆయన వ్యాఖ్యానించారు. పెళ్లికి పందిరి వేసుకున్నా..అడవి బిడ్డలను జైల్లో పెడుతున్నారని, పోడు భూముల కోసం ఎన్నాళ్ళు ఎదురు చూడాలని ఆయన ప్రశ్నించారు.

Also Read : DGP Anjani Kumar : శాంతి, భద్రతల పరిరక్షణకు మరింత అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్ అడవి బిడ్డల వేదనని ఖర్గే ప్రపంచానికి చాటుతారన్నారు భట్టి. కాంగ్రెస్ ప్రజల పార్టీ.. ఏ నాయకుడు బయటకు పోయినా నష్టం లేదని ఆయన అన్నారు. ఇందిరా హయాంలో కూడా కాంగ్రెస్‌ని ఇలాగే దెబ్బ తీసే కుట్ర చేశారని, కాంగ్రెస్ ప్రజల పార్టీ.. ప్రజలే కాపాడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భూములు అమ్ముకోవడం ఏంటి సిగ్గుచేటని ఆయన విమర్శించారు. అమెరికాలో పరిచయం అయ్యాడు అని.. ఐకియా కి భూములు ఇచ్చారని, ఐటీ హబ్ లో ఫర్నిచర్ షాప్ కి భూములు ఇవ్వడం విడ్డూరమని ఆయన అన్నారు. అప్పనంగా భూములు అమ్ముకోవడం దుర్మార్గమని ఆయన దుయ్యబట్టారు.

Also Read : DGP Anjani Kumar : శాంతి, భద్రతల పరిరక్షణకు మరింత అప్రమత్తంగా ఉండాలి