Site icon NTV Telugu

Bhatti Vikramarka : గిరిజనులు పడే బాధలేంటో నా పాదయాత్రలో చూశాను

Bhatti Vikramarka

Bhatti Vikramarka

కాంగ్రెస్ పార్టీని కానీ.. రాహుల్ గాంధీని కానీ విమర్శించే స్థాయి బీఆర్ఎస్, బీజేపీ నేతలకు లేదన్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన ఏపీలో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం ఏటీఎంల్లా వాడపకుంటోందని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధుల్లో సగం నిధులు దుర్వినియోగం అయ్యాయని, కొమురం భీం పేరు ఉచ్చరించే అర్హత కేటీఆరుకు లేదని ఆయన అన్నారు.

Also Read : AP CM Jagan: 146 కొత్త 108 అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం జగన్

గిరిజనులు పడే బాధలేంటో నా పాదయాత్రలో చూశానని, బీఆర్ఎస్ చేసిన దోపిడీకి ఎప్పుడో ఆ పార్టీ గుండు సున్నా కావాలన్నారు. ప్రజా సంపద దోచుకుంటున్న బీఆర్ఎస్ పార్టీని బీజేపీనే కాపాడుతోందని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలో బీసీ సబ్ ప్లాన్ తెస్తామన్నారు. బీసీల సంక్షేమం కాంగ్రెస్ బాధ్యత అన్న భట్టి విక్రమార్క.. ఇచ్చిన హామీలే కాదు.. ఇవ్వని హామీలు కూడా నెరవేర్చింది కాంగ్రెస్సే అన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీ-ఇంబర్స్‌మెంట్ పథకాల వంటివి మేం హామీ ఇవ్వకున్నా అమలు చేశామన్నారు. కాంగ్రెస్ అంటే సంక్షేమం.. సంక్షేమం అంటేనే కాంగ్రెస్ అని భట్టి వ్యాఖ్యానించారు. ఏపీ నుంచి వలస వచ్చి తెలంగాణలో నివాసం ఉంటున్న వారిని ఇంకా సెట్లర్లు అనడం సరికాదన్నారు.

Also Read : AP Weather Update: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు.. రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలి

Exit mobile version