Site icon NTV Telugu

Bhatti Vikramarka : బీజేపీ, బీఆర్ఎస్‌ డ్రామాలాడుతున్నాయి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

హాత్‌ సే హాత్‌ అభిమాన్‌ పేరిట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మంచిర్యాలలో భట్టి పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. మామ, అల్లుడు, కూతురు అవినీతి చేస్తున్నారని చెప్పే ప్రధాని ఎందుకు ఊరుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. బిల్లుకు ఆరోజు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది కదా.. ఇప్పుడు ఎందుకు పోరాటం చేస్తున్నట్టు అని భట్టి అన్నారు. అక్కడ ప్రధాని ఇక్కడ కేసీఆర్ సింగరేణి ని ప్రైవేట్ కు అప్పగిస్తున్నారని భట్టి ఆరోపించారు.

Also Read : Venkat Prabhu: నాగ చైతన్య డైరెక్టర్ వెంకట్ ప్రభు అరెస్ట్.. ఎందుకంటే ..?

ఇద్దరు ఒక్కటేనని, ఇద్దరు లూటీ చేస్తున్నారని భట్టి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా ఆడుతున్న నాటకమే ఇదాంత అని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ఇద్దరు పాత్రధారులు ఉన్నారని, బీఆర్ఎస్ ఎంత అవినీతి చేసిందో బీజేపి అంతే చేస్తుందని ఆయన విమర్శించారు. ఇల్లు లేదని చెప్పే నరేంద్ర మోడీ ఎన్నికల ఖర్చులకు, పార్టీ కార్యాలయాలకు ఇన్ని వేల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయని భట్టి ప్రశ్నించారు. పవర్ ప్లాంట్ లు, ఓపెన్ కాస్ట్ లు సీఎం కేసీఆర్ ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Also Read : Shooting Thailand: థాయ్‌లాండ్‌లో ఫైరింగ్.. కాల్పుల్లో నలుగురు మృతి

Exit mobile version