Venkat Prabhu: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న చిత్రం కస్టడీ. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో చై సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శివ అనే పవర్ ఫుల్ కానిస్టేబుల్ పాత్రలో చై కనిపిస్తున్నాడు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ల జోరును పెంచేశారు. ఈ కాలంలో సినిమా ఎలా ఉన్నా.. ప్రమోషన్స్ మాత్రం డిఫరెంట్ గా ఉండాలి. అలా ఉంటేనే ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి చూపిస్తారు. ఇక ఈ ప్రమోషన్స్ స్ట్రాటజీ తెలుసుకున్న కస్టడీ చిత్రబృందం వైరెటీగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
Ram Charan: చరణ్ విష్ చేసినా పట్టించుకోని బన్నీ.. ఎన్టీఆర్ ను మాత్రం బావ అంటూ
సినిమా కథకు తగట్టు ఒక జైలులో వెంకట్ ప్రభును చై అరెస్ట్ చేసి కస్టడీ అప్డేట్ అడుగుతాడు. ఇక జైలులో ఉన్న వెంకట్ ప్రభు తనను తానూ ట్రోల్ చేసుకుంటాడు. తెలుగులో ఎందుకు సినిమా తీస్తున్నారు డబ్బు కోసమా.. అంటే కాదు ఆస్కార్ కోసమని చెప్పుకొస్తాడు. ఇక కస్టడీ మూవీ టీజర్ వచ్చి మూడు వారాలు అవుతుంది . తరువాత అప్డేట్ ఇంకా రాలేదని చై అడుగగా.. లిరికల్ వీడియో రిలీజ్ చేద్దాం.. యువన్ కు ఫోన్ చేసి అడుగుతా అంటూ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ కు కాల్ చేసి అడుగగా మూడురోజులు టైమ్ పడుతుంది అని చెప్తాడు. మూడు రోజుల్లో కస్టడీ నుంచి లిరికల్ వీడియో వస్తుంది అని చెప్పనుగా తినడానికిఏమైనా.. అనగానే చై.. బిర్యానీ తెప్పిస్తాలే నైట్ కు అంటే.. అది కూడా యావరేజ్ గానే ఆడిందమ్మా అంటూ తన సినిమాను తానే ట్రోల్ చేసుకుంటాడు. ఇక చివర్లో కస్టడీ నుంచి మొదటి సాంగ్ ఏప్రిల్ 10 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ప్రమోషన్స్ బాగున్నాయి. సినిమా కూడా మంచిగా హిట్ కొడితే సంతోషం అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.