NTV Telugu Site icon

Bhatti Vikramarka: పని చేసే సీఎం కావాలా.. ఫామ్ హౌస్ లో పడుకునే సీఎం కావాలా..?

Batti

Batti

కేసీఆర్ కుటుంబం చెప్పే మాటలను ప్రజలు నమ్మరు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు.. అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకి దోచి పెట్టారు.. దోపిడీ, కమిషన్ల వల్ల ప్రభుత్వం అప్పుల్లో కూరుకుని పోయింది.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మా దగ్గర బడ్జెట్ ఉంది.. బడ్జెట్ లో దోపిడీ, కమిషన్లు వుండవు అందు వల్లే మాకు హామీలు నెరవేర్చేందుకు నిధుల కొరత ఉండదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ వాగ్దానాలు ఇచ్చి చేయలేదు కాబట్టి ఎవ్వరూ చేయలేరు అనుకుంటే ఎలా.. కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుంది అని భట్టి విక్రమార్క అన్నారు.

Read Also: Ozone Hospitals: వరల్డ్ హార్ట్ డే.. ఓజోన్ హాస్పిటల్స్ సీపీఆర్‌ క్యాంప్‌లు..

గారెంటీ కార్డ్ ను మూడు నెలలు భద్రపరచుకోవాలి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పదేళ్ల నుంచి చేయలేని పథకాలు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటిస్తుంది.. ప్రజల ముందు నక్క వినయం ప్రదర్శన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సందర్భంగా హామీలు చేస్తున్నారు.. ఎవ్వరూ ముఖ్యమంత్రి అనేది కాదు ప్రజలకు సేవ జరుగుతుందా లేదా అన్నది ముఖ్యం అని ఆయన తెలిపారు. పని చేసే సీఎం కావాలా ఫామ్ హౌస్ లో పండుకునే సీఎం కావాలా అని ప్రజలు నిర్ణయించుకోవాలని భట్టి తెలిపారు.

Read Also: World Cup 2023: వన్డే ప్రపంచకప్లో సెమీ ఫైనల్కు వెళ్లే జట్లు ఇవే..?

కేసీఆర్ ఎప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటాడు అని భట్టి విక్రమార్క ఆరోపించాడు. అసెంబ్లీ సమావేశాల అప్పుడు మాత్రమే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే సీఎం కావాలా సంపదను సృష్టించి ప్రజలకు అందించే సీఎం కావాలా.. తేల్చుకోవాలని ఆయన అన్నారు. వైఎస్ఆర్ నిరంతరం ప్రజలను కలిసే వారు.. అభ్యర్థుల ప్రకటన అనేది నోటిఫికేషన్ వచ్చిన తరువాత వస్తుంది.. కానీ ముందే ఇస్తాము.. సీట్లు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా అంటే ప్రజలే ముఖ్యం అని భట్టి అన్నారు. పార్టీ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి.. బీఎస్పీతో కుడా చర్చలు జరుగుతాయి.. బీఎస్పీ నేత మాయావతి చర్చలు చూస్తారు..

Read Also: Gundeninda Gudi Gantalu: ‘స్టార్ మా’లో సరికొత్తగా “గుండె నిండా గుడిగంటలు” సీరియల్

ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఐదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది అని భట్టి విక్రమార్క అన్నారు. కొన్ని సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది అన్నారు. పోతులకు సంబంధించి టికెట్లను అధికారికంగా సెంట్రల్ కమిటీ నుంచి ప్రకటన వస్తుంది.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఆదాయ వనరులు వుంటాయి.. సంక్షేమ పథకాలకు నిధులకి ఎటువంటి కొరత లేదు అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పార్టీ విధేయత, గెలుపు గుర్రాల, ప్రజలతో ఉన్న అనుబందం అన్ని చూసి టికెట్ల పంపిణీ జరుగుతుంది.. ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది అని భట్టి ధీమా వ్యక్తం చేశాడు.